మందు తాగి కారు నడిపిన మహిళా మంత్రి, రాజీనామా
స్వీడన్: స్వీడన్‌లో తొలి ముస్లీం మహిళా మంత్రి మద్యం తాగి కారు డ్రైవింగ్ చేసింది. దీంతో, ఆమె రాజీనామా చేయవలసి వచ్చింది. బోస్నియా నుంచి చిన్న వయస్సులోనే శరణార్థిగా వచ్చి స్వీడన్‌లో స్థిరపడిన ఎయిదా హాడ్జాలిక్ 29 ఏళ్ల వయసులోనే ప్రజాభిమాన్ని చూరగొంది.
ప్రస్తుతం మాధ్యమిక, వయోజన విద్యా శాఖల మంత్రిగా ఉన్నారు. ఆమె తాజాగా, మద్యం సేవించి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడింది. డ్రైవింగ్ చేస్తున్న ఆమెను పోలీసులు ఆపి తనిఖీ చేయగా, మోతాదుకు మించి మద్యం తాగి ఉన్నట్టు తేలింది.

మద్యం తాగి కారు నడపడంపై ఆమె కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పని వాపోయింది. తప్పుకు బాధ్యత వహిస్తున్నానని, తనను నమ్మినవారికి తీవ్ర నిరాశను కలిగించానని చెప్పింది. ఆమె రాజీనామా చేసింది.












Click it and Unblock the Notifications