మరో ఆఫ్ఘనిస్తాన్: పక్కలో బల్లెం: తాళ్లతో కట్టి నడిరోడ్డు మీద ఈడ్చుకుంటూ..!!

Syrian Civil War: సిరియాలో కొద్దిరోజుల కిందట ఆరంభమైన అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. అక్కడి వేర్పాటువాదులు, తిరుగుబాటుదారులు.. ఒక్కో నగరాన్నీ ఆక్రమించుకుంటూ వస్తోన్నారు. రష్యా, ఇరాన్ మద్దతుతో కొనసాగుతున్న బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వం కుప్పకూలే దశకు చేరుకుంటోంది. ఒక్కో నగరాన్నీ కోల్పోతోంది.

టర్కీ మద్దతుతో..

టర్కీ మద్దతుతో మిలీషియా గ్రూప్‌లు, ఇస్లామిస్ట్ తిరుగుబాటుదారులు చెలరేగుతున్నారు. సిరియాలోని రెండో అతిపెద్ద నగరం అలెప్పో, సనా, హమా సిటీలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. తాజాగా హామ్స్ సిటీపైనా పట్టు సాధించారు. పలు రీజియన్లు ప్రభుత్వ నుంచి చేజారాయి. అవన్నీ కూడా తిరుగుబాటులదారుల నియంత్రణలోకి వెళ్లాయి.

Syria Civil War Rebel forces appear to have entered the Damascus after controlling homs

రాజధాని డమాస్కస్‌‌నూ..

రాజధాని డమాస్కస్‌‌నూ స్వాధీనం చేసుకోకపోవడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు ఈ ఇస్లామిస్ట్ మిలీషియా గ్రూపులకు. హామ్స్‌ను చేజిక్కించుకున్న తరువాత ఆయా బలగాలన్నీ కూడా రాజధానికి సమీపిస్తోన్నాయి. శివారు ప్రాంతాలను చుట్టుముట్టాయి. ఏ క్షణంలోనైనా డమాస్కస్‌లో ప్రవేశించవచ్చు.

సైన్యం పూర్తిగా చేతులెత్తేసింది..

తిరుగుబాటుదారుల దెబ్బకు సిరియన్ సైన్యం పూర్తిగా చేతులెత్తేసింది. రష్యా, ఇరాన్ వంటి బలమైన దేశాల సైనిక సహాకారాన్ని అందిస్తోన్నప్పటికీ చేష్టలుడిగిపోవాల్సి వచ్చింది. తిరుగుబాటుదారులు ముందుకు దూసుకొస్తోన్న కొద్దీ ఆర్మీ.. వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఒక్కో నగరాన్నీ ఖాళీ చేసింది.

Syria Civil War Rebel forces appear to have entered the Damascus after controlling homs

నడిరోడ్డు మీద ఈడ్చుకుంటూ..

హామ్స్, హమా, సనా వంటి నగరాల్లో ఏర్పాటుచేసిన బషర్ అల్ అస్సాద్ విగ్రహాలను తిరుగుబాటుదారులు కూల్చివేశారు. తాళ్లతో కటిని నడిరోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. తమ సొంత పతాకాన్ని రెపరెపలాడించారు. అక్కడి ప్రభుత్వ భవనాలు, ఇతర కార్యాలయాలపై వాటిని ఎగురవేశారు.

ఒక చేత్తో తుపాకులు, మరో చేత్తో పతాకాలను

ఒక చేత్తో తుపాకులు పట్టుకుని, మరో చేత్తో పతాకాలను ఎగురవేస్తూ ఆయా నగరాల్లో ప్రధాన రోడ్ల మీద వాహనాల్లో రణనినాదాలు చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఎలా స్వాధీనం చేసుకున్నారో.. అచ్చంగా అలాంటి పరిస్థితులే సిరియాలోనూ నెలకొన్నాయి.

డమాస్కస్‌ను సైతం కోల్పోయే దశ..

ఇప్పుడు డమాస్కస్‌ను సైతం కోల్పోయే దశకు చేరుకుందక్కడి పరిస్థితి. రాజధాని శివార్లలో బర్జే, అల్- అస్సాద్ సబ్ అర్బ్, అల్- టాల్, మార్బా, ఇర్బిన్ వంటి ప్రాంతాల్లో మాటువేశాయి మిలీషియా గ్రూపులు. మౌంట్ కాసియాన్ వైపు కదులుతున్నాయి. దీన్ని దాటుకుంటే డమాస్కస్ సిటీలో అడుగుపెట్టినట్టే అవుతుంది.

అయిదు దశాబ్దాల పాటు..

బషర్ అల్-అస్సాద్ కుటుంబం అయిదు దశాబ్దాల పాటు సిరియాను పరిపాలిస్తూ వస్తోంది. ఆ దేశ చరిత్రలో తొలిసారిగా ఆయన ప్రభుత్వం పతనావస్థకు చేరుకుంటోంది తిరుగుబాటుదారుల వల్ల. రాజధానిని స్వాధీనం చేసుకోగలిగితే మాత్రం బషర్ అస్సాద్‌ ప్రభుత్వం పూర్తిగా కుప్పకూలినట్టవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+