అర్ధరాత్రి హుటాహుటిన అప్రమత్తమైన కేంద్రం: ప్రయాణాలు మానుకోవాలంటూ ఆదేశాలు

Syrian Civil War: సిరియాలో అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోంది. అక్కడి వేర్పాటువాదులు, తిరుగుబాటుదారులు.. ఒక్కో నగరాన్నీ ఆక్రమించుకుంటూ వస్తోన్నారు. రష్యా, ఇరాన్ మద్దతుతో కొనసాగుతున్న బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వం కుప్పకూలే దశకు చేరుకుంటోంది. ఒక్కో నగరాన్నీ కోల్పోతోంది.

టర్కీ మద్దతుతో మిలీషియా గ్రూప్‌లు, ఇస్లామిస్ట్ తిరుగుబాటుదారులు చెలరేగుతున్నారు. సిరియాలోని రెండో అతిపెద్ద నగరం అలెప్పో సైతం వారి వశమైంది. సనా, హమా సిటీనీ తాజాగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. పలు రీజియన్లు ప్రభుత్వ నుంచి చేజారాయి. అవన్నీ కూడా తిరుగుబాటులదారుల నియంత్రణలోకి వెళ్లాయి.

Syrian Civil War Central issues advisory to all Indian nationals to avoid travel to Syria

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సిరియాలో నానాటికీ దిగజారుతున్న శాంతిభద్రతలు, యుద్ద వాతావరణంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సిరియా అంతర్యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని అర్ధరాత్రి కీలక ప్రకటన విడుదల చేసింది. అడ్వైజరీని జారీ చేసింది. తదుపరి ప్రకటన జారీ అయ్యేంత వరకూ సిరియాకు వెళ్లొద్దని, ప్రయాణాలను మానుకోవాలని సూచించింది.

దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదింపులు నిర్వహించడానికి హెల్ప్‌లైన్ నంబర్, ఇమెయిల్ ఐడీని అందుబాటులోకి తీసుకొచ్చారు. సిరియాలో ఉన్న భారతీయులందరూ కూడా డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు.

డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయం కోసం ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ +963 993385973. అలాగే అత్యవసర ఇమెయిల్ [email protected]. ద్వారా రాయబార కార్యాలయ సిబ్బందిని సంప్రదించాలని జైస్వాల్ సూచించారు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Syrian Civil War Central issues advisory to all Indian nationals to avoid travel to Syria

బషర్ అల్-అస్సాద్ కుటుంబం అయిదు దశాబ్దాల పాటు సిరియాను పరిపాలిస్తూ వస్తోంది. ఆ దేశ చరిత్రలో తొలిసారిగా ఆయన ప్రభుత్వం పతనావస్థకు చేరుకుంటోంది తిరుగుబాటుదారుల వల్ల. హామ్స్‌ను స్వాధీనం చేసుకోగలిగితే మాత్రం బషర్ అస్సాద్‌ ప్రభుత్వం పూర్తిగా కుప్పకూలినట్టవుతుంది.

సిరియా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయానికి ఇస్లామిస్ట్ తిరుగుబాటుదారులు, మిలీషియా గ్రూపులు.. హామ్స్ శివార్లకు చేరుకున్నట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ మానిటర్ తెలిపింది. కేవలం అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+