Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విగ్రహాల విధ్వంసకాడ- అధ్యక్షుడి భవనం లూటీ..!!

Syrian Civil War: సిరియాలో కొద్దిరోజుల కిందట ఆరంభమైన అంతర్యుద్ధానికి తెరపడినట్టే. అక్కడి వేర్పాటువాదులు, తిరుగుబాటుదారులు, మిలీషియా గ్రూపులు ఉమ్మడిగా అక్కడి ప్రభుత్వాన్ని కూలగొట్టారు. రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ క్రమంలో దేశాధ్యక్షుడు బషర్ అల్- అస్సాద్ దేశం విడిచి పారిపోయారు. ఇప్పటివరకు ఆయన ఆచూకీ తెలియరావట్లేదు. ఇరాక్‌కు పారిపోయి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారింంచారు. కుటుంబ సభ్యులతో కలిసి సిరియా ఉత్తర ప్రాంతం మీదుగా సరిహద్దులను దాటుకుని ఉంటాడని చెబుతున్నారు.

Syrians captured Bashar al-Assad s residence in Damascus

ఆయన రష్యాకు వెళ్లి ఉండొచ్చంటూ వార్తలు వస్తోన్నాయి. రష్యాతో సుదీర్ఘకాలంగా మిత్రత్వాన్ని కొనసాగిస్తూ వస్తోన్నారు అల్-అస్సాద్. తిరుగుబాటుదారులు హామ్స్ నగరాన్ని సొంతం చేసుకున్న వెంటనే ఆయన అప్రమత్తం అయ్యారని, వైమానిక దళానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్‌లో మాస్కోకు తరలి వెళ్లారని అంటున్నారు.

బషర్ అల్- అస్సాద్ కుటుంబం 50 సంవత్సరాల పాటు సిరియాను పరిపాలించింది. 1971 నుంచి 1999 వరకు బషర్ తండ్రి హఫెజ్ అల్-అస్సాద్ దేశాధ్యక్షుడిగా వ్యవహించారు. 29 సంవత్సరాల పాటు ఆయన ఏలుబడిలో సాగింది సిరియా. 2000 నుంచి ఇప్పటివరకు బషర్ పరిపాలన సాగిస్తోన్నారు. చివరికి ఆయన ప్రభుత్వం పతనం అయింది.

మొత్తం ఏడు తిరుగుబాటు గ్రూపులు సిరియాలో చాలాకాలంగా క్రియాశీలకంగా ఉంటూ వస్తోన్నాయి. ఆ దేశ ప్రధాన ప్రతిపక్షం హయత్ తాహిర్ అల్- షామ్ దీనికి సారథ్యం వహించింది. ది సిరియన్ నేషనల్ ఆర్మీ, నేషనల్ లిబరేషన్ ఫ్రంట్, ఫ్రీ సిరియన్ ఆర్మీ, సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్, పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్స్, డ్రూజ్ రిలీజియస్ మైనారిటీ గ్రూపులు..ఈ అంతర్యుద్ధంలో పాలుపంచుకున్నాయి.

అల్- అస్సాద్ దేశం విడిచి పారిపోయిన నేపథ్యంలో- తిరుగుబాటుదారులు డమాస్కస్‌లోని అధ్యక్షుడి భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వందలాది మంది భవనంలోనికి చొరబడ్డారు. కాంపౌండ్ వాల్‌ను ధ్వంసం చేశారు. గాలిలో కాల్పులు జరిపి హర్షధ్వానాలను వ్యక్తం చేశారు.

బషర్ ఉపయోగించిన బెడ్‌రూమ్, వ్యక్తిగత కార్యాలయం, ఛాంబర్‌, డైనింగ్ హాల్, వంటగదుల్లో ప్రవేశించి సెల్ఫీలు దిగారు. ఇష్టారీతిన ప్రవర్తించారు. చేతికి అందిన వస్తువులను పట్టుకెళ్లారు. భారీ ఎత్తున దోపిడీలకు పాల్పడ్డారు. వారిలో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఉండటం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


సిరియా వ్యాప్తంగా విగ్రహాలపై విధ్వంసకాండ కొనసాగుతోంది. డమాస్కస్, అలెప్పో, హమా, సనా, ఇడ్లిబ్, లకాటియా, రక్కా, ఆఫ్రిన్, అరిహా, దారా, అల్-సువైదా, టార్టస్, మన్జీబ్.. వంటి నగరాల్లో బషర్ అల్ అస్సాద్, ఆయన తండ్రి హఫెజ్ అల్- అస్సాద్ విగ్రహాలను నేలకూల్చారు.

ఏ ఒక్కదాన్ని కూడా ఉంచనివ్వలేదు. అలాగే- వారిద్దరి ఫొటోలు, బ్యానర్లు ఎక్కడ కనిపించినా కాళ్ల కింద తొక్కడం కనిపించింది. అదే సమయంలో ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ డమాస్కస్ టీవీ కార్యాలయాన్నీ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+