Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాల్స్ లో 60 మంది మహిళల అర్దనగ్న వీడియోలు

సింగపూర్: బహిరంగ ప్రదేశాలలో సంచరిస్తున్న యువతులు, మహిళలకు తెలియకుండా వారి అర్ధనగ్న దృశ్యాలు చిత్రీకరిస్తున్న కామాంధుడిని సింగపూర్ న్యాయస్థానం జైలుకు పంపించింది. సింగపూర్ లో నివాసం ఉంటున్న భారత సంతతికి చెందిన నంతకుమార్ (34) అనే వ్యక్తి జైలుకు వెళ్లాడు.

సింగపూర్ లో 60 మంది యువతులు, మహిళలు అర్దనగ్నంగా ఉన్న దృశ్యాలను ఇతను తన ఐ ఫోన్ లో చిత్రీకరించి వారి జీవితాలతో చెలగాటం ఆడుకున్నాడు. సింగపూర్ పోలీసు అధికారుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

taking upskirt videos of nearly 60 women in Singapore

ఇతను బ్యాగ్ లో ల్యాప్ టాప్ పెట్టుకుని సంచరించేవాడు. బ్యాగ్ లో పుస్తకాలు పెట్టి దాని పైన ఐ ఫోన్ పెట్టాడు. కెమెరా రికార్డింగ్ మోడ్ లో పెట్టి బ్యాగ్ కు జిప్ వెయ్యకుండ సంచరించేవాడు. ఈ విధంగా షాపింగ్ మాల్స్, బహిరంగ ప్రదేశాలలో తిరిగేవాడు.

ఆ ప్రాంతాలలో మహిళల పక్కన, వెనుక నడిచేవాడు. వారికి తెలియకుండ అర్దనగ్నంగా ఉన్న ఫోటోలు, వీడియోలు తీసేవాడు. ఒక రోజు స్కర్టు వేసుకున్న మహిళ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కుర్చుంది ఆ సమయంలో ఆమె కుర్చున్న కుర్చీ కింద బ్యాగ్ పెట్టాడు. తరువాత అతను ఆ పక్కన కుర్చున్నాడు.

ఆ యువతికి అనుమానం వచ్చి స్నేహితులకు చెప్పింది. వారు ప్రశ్నించగా నంతకుమార్ సారీ చెప్పి అక్కడి నుండి వెళ్లడానికి ప్రయత్నించారు. ఆ సందర్బంలో వారు బ్యాగ్ పరిశీలించగా ఐ ఫోన్ కెమెరా ఆన్ లో ఉన్న విషయం వెలుగు చూసింది.

ఐఫోన్ లో ఆ మహిళతో పాటు అనేక మంది అర్దనగ్నంగా ఉన్న క్లిప్పింగ్స్ బయటపడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు నంతకుమార్ ను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం నంతకుమార్ కు ఆరు నెలల జైలు శిక్ష విదించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+