Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కారు డిక్కీలే మహిళల బతుకు: ఇంకెన్ని రూల్సు పెడ్తరో ఆ దేవునికే ఎరుక!

Taliban Rule: తాలిబాన్ పాలనలో మహిళలపై ఆంక్షలు నిరంతరం పెరుగుతున్నాయి. అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. మహిళలు కారు డిక్కీలలో కూర్చొని ప్రయాణం చేయాల్సి వస్తుంది. తాజాగా మరోసారి తాలిబాన్ మహిళలపై ఆంక్షల గురించి చర్చ జరుగుతోంది. 2021 ఆగస్టు 15న తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి మహిళలపై అణచివేత, వారి స్వేచ్ఛను హరించడం నిరంతరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లలో తాలిబాన్ ఆఫ్ఘన్ మహిళలపై విధించిన వివిధ రకాల ఆంక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తాలిబాన్ పాలనలో మహిళలపై విధించిన ప్రధాన ఆంక్షలు (2021 నుండి 2024 వరకు)

*ఆగస్టు 15, 2021 - ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలు పనిచేయడంపై నిషేధం. ఆరోగ్య సేవలు మినహా ఇతర రంగాల్లోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి పంపారు.

*ఆగస్టు 23, 2021- ప్రభుత్వ లేదా ఇతర రంగాలలో నాయకత్వ స్థానాల్లో మహిళల నియామకంపై నిషేధం.

Taliban Rule Afghan Women Forced to Travel in Car Boots Amid Increasing Restrictions

*సెప్టెంబర్ 6, 2021- పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో బాలురు, బాలికలు కలిసి చదువుకోవడంపై నిషేధం విధించి, లింగ-ఆధారిత వివక్ష నియమాలను అమలు చేశారు.

*సెప్టెంబర్ 18, 2021- ఏడో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు బాలికలు 'సిలబస్ సవరించే' వరకు పాఠశాలకు వెళ్లకూడదని ఆదేశం.

*సెప్టెంబర్ 20, 2021 -బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి. (తరువాత ఈ నియమం మరింత కఠినతరం చేయబడింది).

*నవంబర్ 1, 2021- కఠినమైన లింగ వివక్షతో విశ్వవిద్యాలయాలు తిరిగి తెరవబడ్డాయి. మహిళలకు వేరే తరగతి గదుల్లో, కొన్ని ఎంపిక చేసిన సబ్జెక్టులు మాత్రమే చదవడానికి అనుమతి ఇచ్చారు. వారికి విశ్వవిద్యాలయంలో వేరే ప్రవేశ ద్వారం నుంచి రావడం తప్పనిసరి చేశారు.

*మార్చి 23, 2022- బాలికల సెకండరీ పాఠశాలలను తిరిగి తెరుస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, తాలిబాన్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మొదటి రోజు కాసేపటికే బాలికలను ఇంటికి పంపేశారు.

*మే 7, 2022-మహిళలు మొత్తం శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించాలని ఆదేశం. ఆదేశాన్ని పాటించకపోతే శిక్ష విధించేందుకు నిబంధనలు పెట్టారు.

*జూలై 15, 2022- మహిళలు పబ్లిక్ పార్కులు, జిమ్‌లలోకి ప్రవేశించడంపై నిషేధం విధించారు.

*అక్టోబర్ 1, 2022-మహిళలు ఏ రకమైన క్రీడలలో పాల్గొనడంపై తాలిబాన్ నిషేధం విధించింది.

*డిసెంబర్ 20, 2022- విశ్వవిద్యాలయాల్లో మహిళల విద్యపై నిషేధం విధించారు.

*డిసెంబర్ 24, 2022-మహిళలు ప్రభుత్వేతర సంస్థల్లో (NGOs) పనిచేయడంపై నిషేధం విధించారు.

*జనవరి 8, 2023 ప్రైవేట్ పాఠశాలలు, సంస్థలలో మహిళలు బోధించడంపై నిషేధం విధించారు.

*ఫిబ్రవరి 1, 2023-మహిళలు పబ్లిక్ బాత్‌రూమ్‌లలోకి (స్నాన వాటికలు) వెళ్లడంపై నిషేధం విధించారు.

*ఫిబ్రవరి 10, 2023 -ఆరోగ్య సేవల్లో పనిచేసే మహిళలు మినహా ప్రభుత్వ కార్యాలయాల నుంచి మిగిలిన మహిళలను తొలగించారు.

*ఏప్రిల్ 15, 2023- మహిళల కోసం కంప్యూటర్, భాష, ఇతర వృత్తిపరమైన కోర్సుల వృత్తి శిక్షణా కేంద్రాలు మూసివేయబడ్డాయి.

*మే 1, 2023 పురుష సంరక్షకుడు లేకుండా మహిళలు సుదూర ప్రయాణం చేయడంపై నిషేధం విధించారు.

*జూలై 20, 2023- మహిళలు మసీదులకు వెళ్లి నమాజ్ చేయడం, ఇతర బహిరంగ మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడంపై నిషేధం విధించారు.

*నవంబర్ 10, 2023 -ఆఫ్ఘన్ మహిళలు అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌ల కోసం లేదా విదేశాల్లో చదువుకోవడానికి దరఖాస్తు చేయకుండా నిషేధం విధించారు.

*ఫిబ్రవరి 15, 2024- మహిళా టీవీ యాంకర్లను ఉద్యోగాలు మానేయమని బలవంతం చేశారు. వారి స్థానంలో పురుష యాంకర్లను నియమించారు.

*జూన్ 1, 2024-మహిళలు పార్కులు, ఉద్యానవనాలు, పబ్లిక్ రిక్రియేషనల్ ప్రాంతాలలోకి ప్రవేశించడంపై పూర్తి నిషేధం విధించారు.

*అక్టోబర్ 5, 2024- మహిళా వైద్యులు అన్ని సమయాల్లో పురుష సంరక్షకుడితో కలిసి ఉండటం తప్పనిసరి చేశారు.

*ఆగస్టు 10, 2024- మహిళలు నడుపుతున్న కుట్టుపని లేదా దేశీయ హస్తకళల వంటి చిన్న వ్యాపారాలను మూసివేయాలని ఆదేశించారు.

*డిసెంబర్ 3, 2024 -నర్సింగ్, దాయి (మంత్రసాని) శిక్షణా కేంద్రాలను మూసివేయాలని తాలిబాన్ ఆదేశించింది. దీనితో ఆఫ్ఘన్ మహిళలకు విద్య, వృత్తిపరమైన అవకాశాలన్నీ అంతమయ్యాయి.

ఇంకా చాలా ఆంక్షలు... దారుణమైన పరిస్థితులు
*రాజకీయాల్లో నిషేధం: ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలు అధికారిక రాజకీయాల్లో పాల్గొనడానికి అనుమతి లేదు. 2020 వరకు పార్లమెంట్‌లో వారికి 25 శాతానికి పైగా సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. వారు అధ్యక్ష పదవికి కూడా పోటీ చేయవచ్చు. కానీ నేడు వారికి కేబినెట్‌లో ఎలాంటి స్థానం లేదు.

*దుస్తుల కుట్టుపని: పురుష టైలర్లు మహిళల దుస్తులను కుట్టడానికి కూడా అనుమతి లేదు.

*కారు డిక్కీ ప్రయాణాలు: పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఇప్పుడు మహిళలను కారు డిక్కీలలో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దుస్థితి దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లో లింగ వివక్షకు సంబంధించి చేదు వాస్తవాన్ని బహిర్గతం చేస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+