Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హిస్టరీ టీచర్ తలను నరికేశారు.. ఎందుకో తెలుసా..? ఉలిక్కి పడ్డ నగరం

ఫ్రాన్స్‌లో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులకు మహ్మద్ ప్రవక్త కార్టూన్ చూపించిన టీచర్‌ తలను స్కూలు బయట నరికాడు ఓ దుండగుడు. ఈ చర్యను ఖండించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్..ఈ ఘటనను ఉగ్రదాడిగా అభివర్ణించారు. అయితే ఈ ఘాతుకానికి పాల్పడ్డ గుర్తు తెలియని దుండగుడిని పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేయగా తప్పించుకునేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా అక్కడికక్కడే దుండగుడు మృతి చెందాడు.

దుండగుడు చనిపోకముందు అల్లాహో అక్బర్ అని నినదించాడని సాధారణంగా జీహాదీ ఉగ్రవాదులే ఇలా మరణించే ముందు నినాదాలు చేస్తారని ఫ్రాన్స్ పోలీసులు చెప్పారు. 2015 నుంచి ఫ్రాన్స్‌లో అడపా దడపా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఈ ఘటనను ఒక ఉగ్రవాద సంస్థతో సంబంధమున్న వ్యక్తి చేసిన హత్యగా కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని ఫ్రాన్స్ పోలీసులు తెలిపారు. ప్యారిస్ నగరం వెలుపల ఉన్న స్కూలులో ఈ ఘాతుకం జరిగింది. సమాచారం తెలుసుకున్న అధ్యక్షుడు మాక్రాన్ వెంటనే ఘటనా స్థలంకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. దేశంలో టీచర్లకు రక్షణ కల్పిస్తామని చెప్పారు. ఇక ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు సమాచారం. వీరంతా దుండగుడికి సంబంధించిన వారే అని పోలీసులు వెల్లడించారు.

Teacher beheaded in France for showing Prophet Mohammed cartoon to students,Assailant killed

ఇక దాడి ఘటనలో మృతి చెందిన వ్యక్తి హిస్టరీ టీచర్ అని పోలీసులు తెలిపారు. భావవ్యక్తీకరణ టాపిక్‌పై క్లాస్‌లో చర్చ జరుగుతున్న సమయంలో పిల్లలకు మహ్మద్ ప్రవక్త కార్టూన్ చూపించినట్లు తెలుస్తోంది. అయితే అంతకు ముందు ముస్లిం సామాజిక వర్గంకు చెందిన విద్యార్థులను క్లాసు నుంచి బయటకు పంపివేసినట్లుగా ఇతర విద్యార్థులు చెబుతున్నారు. ముస్లిం విద్యార్థులను క్లాసు బయటకు పంపి వివాదానికి టీచర్ తెరలేపారని ఓ విద్యార్థి తల్లిదండ్రులు చెప్పారు. మొహ్మద్ ప్రవక్త కార్టూన్‌ చూపేముందు ముస్లిం విద్యార్థులందరినీ బయటకు వెళ్లాల్సిందిగా టీచర్ చెప్పారని.. వారిని బాధపెట్టడం తనకు ఇష్టం లేదని చెప్పి ముస్లిం విద్యార్థులను బయటకు పంపారని తన కొడుకు చెప్పినట్లు ఓ పేరెంట్ వివరించారు.

Recommended Video

    YS Jagan కుమార్తె Harsha Reddy ఘనత, Bengaluru వెళ్తున్న జగన్ దంపతులు

    ఇక ఈ ఘటనతో ప్యారిస్ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పోలీసులు ఘటనా స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకుని ఇంకా ఏమైనా పేలుడు పదార్థాలు అక్కడ పెట్టారా అన్న కోణంలో జాగిలాలతో చెక్ చేయించారు. ఈ హత్య ఫ్రాన్స్ పార్లమెంటును కుదిపేసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+