యువకుడి పంచ్‌కి కిందపడిపోయిన ప్రధాని రాజోయ్
స్పెయిన్: స్పెయిన్ ప్రధాని మారియానో రాజోయ్కు చేదు అనుభవం ఎదురైంది. సాధారణ ఎన్నికల కోసం ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ప్రధాని రాజోయ్పై ఓ యువకుడు చేయి చేసుకున్నాడు. గలిషియా ప్రాంతంలోని పాంటివెడ్రా నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పాంటివెడ్రా నగరంలోని ఓ వీధిలో ప్రధాని రాజోయ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో 17 ఏళ్ల యువకుడు దాడికి పాల్పడ్డాడు. చాలా సేపు ప్రధాని పక్కనే నిలుచున్న ఆ యువకుడు తన ఎడమ చేతితో రాజోయ్ ముఖంపై పంచ్ విసిరాడు.
VÍDEO: Primeras palabras de Mariano Rajoy tras la agresión https://t.co/f7ANc2JdQJ pic.twitter.com/VjBly690DS
— EL PAÍS (@el_pais) December 16, 2015 కాగా, యువకుడి పంచ్‌కు ప్రధాని కింద కూలబోయారు. అయితే అక్కడే ఉన్న ప్రజలు, సిబ్బంది ప్రధానిని కిందపడకుండా పట్టుకున్నారు. యువకుడి దెబ్బకు ప్రధాని ఎడమ చెంప కందిపోయింది.

దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. ఇది ఇలా ఉండగా, వచ్చే ఆదివారం స్పెయిన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని రాజోయ్కి చెందిన పీపుల్స్ పార్టీనే విజయం సాధిస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications