Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video:కెనడాలో హిందువులపై దాడి..ఏం జరుగుతోంది..?

Attack on Hindus in Canada:కెనడాలో పరిస్థితులు చేదాటిపోతున్నాయి. భారత్ కెనడా దేశాల మధ్య ఇప్పటికే విబేధాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో తాజాగా హిందువులపై హిందూ ఆలయంపై దాడులతో అది అగ్నికి ఆజ్యంపోసినట్లయ్యింది. కెనడా బ్రాంప్టన్‌లోని హిందు సభ ఆలయంపై ఖలీస్తానీయులు దాడిచేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.హిందువులపై హిందూ దేవాలయంపై దాడిని కెనడా ప్రధానితో సహా అక్కడి ఎంపీలు ఖండించారు.

ఇదిలా ఉంటే భారత ప్రభుత్వం కూడా ఈ ఘటనను ఖండించింది.హిందూ ఆలయాలకు అదనంగా భద్రత కల్పించాలని పలుమార్లు కెనడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు భారత్ పేర్కొంది. అయినప్పటికీ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం నిజంగా దురదృష్టకరమని పేర్కొంది.కెనడాలో ప్రతిపక్షనేత పొయిలీవర్ ఘటనను ఖండిస్తూ ఎవరికి నచ్చిన మతాన్ని వారు పాటించే హక్కు ఉందని గుర్తుచేశారు.బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న హిందువులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ఎక్స్ ద్వారా తెలిపారు. ప్రజలందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈ అంశానికి ముంగిపు పలుకుతామని వెల్లడించారు.

Tensions Rise as Hindus Attacked by Khalistani Supporters at Canadian Temple

కెనడాలో ప్రస్తుత పరిస్థితి సురక్షితంగా లేదని టొరంటో ఎంపీ కెవిన్ వాంగ్ అన్నారు. వేర్పాటువాదులకు కెనడా సురక్షిత స్థానంగా మారిందని ఆరోపించారు. కెనడాలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని చెప్పిన కెవిన్.. ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైందని అన్నారు.కెనడాలో నివసిస్తున్న క్రైస్తవులు,జ్యూయిష్‌లను సంరక్షించడంలో ఎలాగైతే జస్టిన్ ట్రూడో ప్రభుత్వం విఫలమైందో ఇప్పుడు హిందువులకు కూడా రక్షణ కల్పించడంలో ఫెయిల్ అయ్యిందని మండిపడ్డారు. ఇక కెనడాలో రెడ్ లైన్‌ను ఖలిస్తానీ వేర్పాటువాదులు దాటేశారని, ఇందుకు తాజాగా హిందువులపై జరిగిన దాడే నిదర్శనమని మరో ఎంపీ చంద్ర ఆర్య మండిపడ్డారు.

ఇదిలా ఉంటే మరో నాన్ ప్రాఫిట్ సంస్థ అయిన హిందూ కెనాడియన్ ఫౌండేషన్ ఓ వీడియోను తన సోషల్ హ్యాండిల్‌లో పోస్టు చేసింది. హిందూ ఆలయం వద్ద మహిళలు పిల్లలపై ఖలిస్తానీయులు నిర్దక్ష్యిణ్యంగా దాడులు చేస్తున్న వీడియోను పోస్టు చేసింది.దాడుల సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ ఎవరినీ అరెస్టు చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పుకొచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+