ఇంతలా ఎప్పుడూ భయపడలేదు!: తెరవగానే పాములు వచ్చాయి (వీడియో)

సౌత్ అమెరికా: దక్షిణ అమెరికాలో ఒళ్లి జలదరించే సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి షెడ్ ఓపెన్ చేయగానే ఏకంగా 30 పాములు బయటకు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చాలా భయాన్ని కలిగించేలా ఉంది.

ఈ వీడియో సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌లో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన చాలామంది భయకంపితులు అవుతున్నారు! ఇది దక్షిణ అమెరికాలో జరిగింది.

బాబీ కోవాన్ అనే వ్యక్తి ఓ రోజు టెక్సాస్‌లోని గోర్మాన్‌లో ఉన్న తన ఫాంకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. అక్కడ ఉన్న ఓ కేబిన్ కింద ఓ పామును గుర్తించారు. ఆ తర్వాత మరొకటి గుర్తించారు. ఆ కేబిన్‌ను పైకి లేవనెత్తారు. అప్పుడు వారికి డజన్ల కొద్ది పాములు కనిపించాయి. దీంతో వారి భయకంపితులయ్యారు.

Terrifying moment man finds writhing nest of thirty rattlesnakes

ఇందుకు సంబంధించిన వీడియోను బాబీ కోవాన్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. అన్ని పాములు ఒక్కసారిగా రావడం చూసి తాము ఆశ్చర్యపోయామని అతను పేర్కొన్నారు. ఈ వీడియోను అతను షేర్ చేశాక బాగా వైరల్ అయింది. వేలు, లక్షలాది మంది చూస్తున్నారు.. షేర్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన వారు చాలామంది తాము కూడా షాకయ్యామని కామెంట్స్ పెట్టారు. నేను చాలా భయానికి లోనయ్యానని, ఇప్పటి వరకు ఇంతగా ఎప్పుడు భయపడలేదని ఓ నెటిజన్ స్పందించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+