డే కేర్ సెంటర్‌లో దుండగుడి కాల్పులు: 23 మంది చిన్నారులతోపాటు 34 మంది మృతి
బ్యాంకాక్: థాయిలాండ్‌లోని ఓ ప్రీస్కూల్ వద్ద ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల ఘటనలో కనీసం 34 మంది మరణించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. మృతుల్లో ఎక్కువ మంది స్కూల్ పిల్లలే కావడం గమనార్హం. మొత్తం 23 మంది పిల్లలు మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
మృతుల్లో ఓ గర్భిణి మహిళ కూడా ఉన్నారు. ఈ మారణకాండ థాయిలాండ్ ఈశాన్య ప్రాంతం నాక్లాంగ్ జిల్లాలోని నాంగ్‌బు నాలంపూ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. తుపాకీతో డే కేర్ సెంటర్‌లోకి ప్రవేశించిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. అతడ్ని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే. నిందితుడు వారిపైనా కాల్పులు జరిపాడు. అనంతరం నిందితుడు పరారరయ్యాడు. కాల్పులకు పాల్పడిన అనంతరం నిందితుడు బ్యాంకాక్ రిజిస్ట్రేషన్ ఉన్న 4 డోర్ వీగో పికప్ ట్రక్ ఎక్కి పారిపోయాడు. దీంతో అతని కోసం పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు.
అయితే, నిందితుడు ఆ తర్వాత తన భార్య, పిల్లలను చంపి.. ఆ తడు కూడా కాల్చుకుని చనిపోయాడని పోలీసులు తెలిపారు.
నిందితుడిని 34 ఏళ్ల పాన్య ఖమ్రాప్‌గా అనుమానిస్తున్నారు. నిందితుడు మాజీ పోలీసు అధికారి కావడం గమనార్హం. మాదక ద్రవ్యాలు వాడినట్లు తేలడంతో అతడ్ని ఏడాది కిందటే పోలీసు విధుల నుంచి తొలగించారు. వాస్తవానికి అతడు శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.
కాగా, సాధారణంగా థాయిలాండ్ లో భారీ కాల్పుల ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. చివరిసారిగా 2020లో నఖోమా రాట్చెస్మా నగరంలో ఓ సైనికుడు కాల్పులు జరపడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications