పుతిన్ కూతుళ్లే టార్గెట్.. ఆంక్షల జాబితాను సిద్ధం చేసిన ఈయూ : రష్యాపై ప్రతీకారం
ఉక్రెయిన్ పై యుద్ధకాండకు దిగిన రష్యాపై ప్రపంచదేశాలు ఆంక్షలు విధించాయి. ఇప్పటికే వాణిజ్య పరంగా చమురు దిగుమతులు, స్విఫ్ట్ నుంచి తొలగించడంతో పాటు ఇతర ఆంక్షలను యూరోపియన్ యూనియన్ విధించింది. మాస్కోకు చెందిన ప్రముఖులు, వ్యాపార సంస్థలపై దృష్టి పెట్టి షరతలు పెట్టింది. అయినా ఉక్రెయిన్ పై రష్యా తన దాడులను మాత్రం కొనసాగిస్తోంది. ఒక వైపు చర్చలు జరుపుతూనే మరో దురాక్రమణలకు పాల్పడుతోంది. రాజధాని కీవ్ కు సమీపంలో ఉన్న బూచాలో రష్యా సైనికులు జరిపిన మారణ కాండపై ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నారు. రష్యాను కట్టడి చేసేందుకు మరిన్ని చర్యలకు ఈయూ దేశాలు పూనుకుంటున్నాయి.

పుతిన్ కుమార్తెలపై టార్గెట్..
తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూతుళ్లను యూరోపియన్ యూనియన్ దేశాలు టార్గెట్ చేశాయి. కఠిన ఆంక్షలను విధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పుతిన్ కుమార్తెలు కాటేరీనా , మరియాలపై విధించే ఆంక్షల జాబితాను ఈయూ సిద్దం చేసింది. అయితే ఇద్దరి కుమార్తెల ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ ఆంక్షలు ప్రత్యేకంగా పుతిన్ దృష్టికి వెళ్లేలా ఉండబోతున్నాయని ఈయూ వర్గాలు వెల్లడించాయి.

రష్యాపై ఈయూ ప్రతీకార చర్యలు.
రష్యాకు చెందిన ప్రముఖ రాజకీయ నేతలు, బడా వ్యాపారవేత్తలతో పాటు పలువురు ప్రముఖుల ఆస్తులపై ఈయూ ఆంక్షలు విధించేందుకు ప్రణాళిక సిద్దం చేసింది. ఇందులో భాగంగా పుతిన్ ఇద్దరు కుతుళ్లలపైనా ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది. అయితే వీటిపై చర్చించి ఈయూ దేశాల ప్రభుత్వాలు ఆమోంచాల్సి ఉంది. ఇప్పటికే రష్యాకు చెందిన నాలుగు బ్యాంకులు, బొగ్గు ఉత్పత్తులు, చమురు దిగుమతులపై కొత్త ఆంక్షలు విధించింది.

ఇద్దరు కూతుళ్ల రహస్య జీవనం..
అయితే అలాంటి ఆంక్షల ప్రతిపాదనేది తమ దృష్టికి రాలేదని క్రెమ్లిన్ తెలిపింది. పుతిన్ ఇద్దరు కూమార్తెలు ప్రస్తుతం రహస్యంగా జీవిస్తున్నారు. వారు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. ఎప్పటికప్పుడు కొత్త పేర్లతో పలు ప్రాంతాల్లో నివాసం ఉంటుంటారు. వారు ఎలా ఉంటారో కూడా రష్యా ప్రజలకు కూడా తెలియదు. 2015లో పుతిన్ తన కూతుర్లు గ్రాడ్యుయేటర్లని మాత్రమే వెల్లడించారు. వాళ్ల పేర్లు కానీ, ఫోటోలు కానీ అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఏనాడు విడుదల చేయలేదు. ఈనేపథ్యంలో పుతిన్ కుమార్తెలపై ఈయూ దేశాలు ఆంక్షలు సిద్ధం చేయయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది..
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications