Israel-Palestine War: యుద్ధానికి ఈ చిన్నారి జుట్టు రాలిపోవడానికి సంబంధం ఏంటి..?

Israel-Palestine War:సాధారణంగా జుట్టు రాలిపోవడం ఎప్పుడు జరుగుతుంది.. శరీరానికి అవసరమైన పోషకాహారాలు అందనప్పుడు లేదా ఎక్కువగా ఒత్తిడికి గురవడం, డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం వంటి కారణాలతో జుట్టు రాలుతుంది. జుట్టు రాలిపోయినా మరీ తీవ్రస్థాయిలో అయితే ఉండదు. కానీ యుద్ధం వల్ల జుట్టు రాలిపోవడం ఎప్పుడైనా విన్నారా..? ఇప్పుడు పాలస్తీనలో అదే జరుగుతోంది. ఇంతకీ యుద్ధానికి జుట్టురాలి పోవడానికి సంబంధం ఏంటి..?

చిన్నారుల ఆరోగ్యంపై..

ఇజ్రాయిల్ పాలస్తీనల మధ్య యుద్ధ వాతావరణం ఇంకా చల్లబడలేదు. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ క్షిపణి దూసుకొస్తుందో అని సరిహద్దు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు ఇదే టెన్షన్ , ఆందోళన ఒత్తిడితో ఇటు మానసికంగా అటు శారీరకంగా నలిగిపోతున్నారు. తాజాగా ఓ ఎనిమిదేళ్ల పాలస్తీన బాలిక సమా తబిల్ ఈ యుద్ధ వార్తలతో ఎంతో నలిగిపోయింది. తన పరిస్థితిని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థతో పంచుకుంది. యుద్ధం వల్ల తాను మానసిక క్షోభకు గురవుతున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే తన జుట్టు రాలిపోవడం ప్రారంభమైందని తెలిపింది.

The Harrowing Impact of War 8-Year-Old Palestinian Girls Trauma Leads to Hair Loss

సమా తబిల్ ఆవేదన..

అసలు అంత చిన్న వయసులో ఉన్నపలంగా జుట్టు రాలిపోతుండటంతో ఆందోళనకు గురైంది సమా తబిల్. దీన్నే అలోపేసియా అరేటా అని వైద్య పరిభాషలో పిలుస్తారట. అధిక ఒత్తిడికి గురైనప్పుడు,వేదన చెందినప్పుడు ఆ ప్రభావం జుట్టుపై పడి క్రమంగా రాలిపోతుందట. గత కొన్ని నెలలుగా ఇజ్రాయిల్ పాలస్తీన దేశాలకు సరిహద్దుగా ఉన్న గాజా ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎన్నో కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక సమా తబిల్ అనే ఈ ఎనిమిదేళ్ల బాలిక తన కుటుంబ సభ్యులను పోగొట్టుకుంది. నిత్యం క్షిపణి శబ్దాలతో ఆ ప్రాంతం దద్దరిల్లి పోతుండటం, తన వారిని పోగొట్టుకున్న బాధ మరింత ఎక్కువగా అవడంతో ఆ ప్రభావం సమా తబిల్ ఆరోగ్యంపై పడింది. ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఒక్క సమా తబిల్‌కు మాత్రమే కాదు.. ఆ వయసున్న చాలామంది చిన్నారులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

ఇక సమా తబిల్ విషయానికొస్తే తన ఇంటి వద్దే బాంబు పేలడం ఆ తర్వాత జరిగిన పరిణామాలను వివరించింది. తన ఇంటి వద్దే బాంబు పేలడంతో చాలా భయపడినట్లు చెప్పుకొచ్చింది. చాలా రోజులు నిద్రలేని రాత్రులు గడిపినట్లు వివరించింది. ఒకరోజు ఉన్నపలంగా తన జట్టు ముద్దల్లాగా రాలి పడటాన్ని గమనించినట్లు సమా తబిల్ పేర్కొంది.అయితే ఇజ్రాయిల్ పాలస్తీన లాంటి వివాదాస్పద ప్రాంతాల్లో నివసిస్తున్న చిన్నారుల్లో చాలామందికి జుట్టు రాలిపోవడం అనేది తాము గమనించినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. వీరంతా మానసికంగా బలపడేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు..?

ఇక ఈ మానసిక ఒత్తిడి నుంచి చిన్నారులు బయటపడకపోతే దీర్ఘకాలంలో వారి మానసిక శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాజాలో ఇలాంటి మానసకి ఒత్తిళ్లకు గురవుతున్న చిన్నారులను గుర్తించి అక్కడ వారికి సరైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు, ఆరోగ్య రంగానికి చెందిన నిపుణులు అభ్యర్థిస్తున్నారు. చిన్నారులు వెళుతున్న మానసిక ఒత్తిడి, క్షోభ ఆవేదనను స్వేచ్ఛగా చెప్పుకునే వాతావరణం కలిగించాలని కోరుతున్నారు.అదే సమయంలో మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడేలా కావాల్సిన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సూచిస్తున్నారు.

The Harrowing Impact of War 8-Year-Old Palestinian Girls Trauma Leads to Hair Loss

గాజా ప్రాంతంలో ఈ వివాదాలతో పాటు చిన్నారుల కష్టాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా అవి హాని కలిగిస్తున్నాయి.యుద్ధం వల్ల మానవాళి చాలా కోల్పోతుందనే విషయం స్పష్టం అవుతోంది.కచ్చితంగా సమా తబిల్ కథ ఈ ప్రాంతంలో శాంతి సమాధానం ఉండాలని చెబుతోంది. కేవలం ఆ చిన్నారికి మాత్రమే కాదు... ఆ ప్రాంతంలో నివసిస్తున్న భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా బాగుండాలంటే అక్కడ యుద్దానికి బ్రేక్ పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+