ఫోటో స్టోరీ: ఆకాశంలో 49 పక్షులు, నిజంగా అద్భుతం
ఓర్లాండో: ఈ ఫోటో చూస్తే మీకు ఏమీ అర్ధం కాదు. గాల్లో ఎగురుతున్న పక్షుల ఫోటో ఇది. కానీ ఈ ఫోటో వెనుకున్న స్టోరీ చదివితే మాత్రం నిజంగా ఇదొక అద్భుతంలా అనిపిస్తోంది. జూన్ 12వ తేదీన అమెరికాలోని ఓర్లాండోలో ఐసీస్ సానుభూతి పరుడు మతీన్ జరిపిన కాల్పుల్లో 49 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.
జూన్ 12 రాత్రి ఆప్గనిస్తాన్ జాతీయుడైన ఓమర్ మతీన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. కాల్పుల ఘటన జరిగిన మరుసటి రోజున మృతులకు నివాళి అర్పించడానికి ఓర్లాండోలోని డాక్టర్ ఫిలిప్స్ పెర్మామింగ్ ఆర్ట్స్ సెంటర్‌లో అంతా గుమిగూడారు. ఆ సమయంలో ఓ ఫోటోగ్రాఫర్ స్వేచ్ఛకు, శాంతికి చిహ్నమైన పక్షులు ఆకాశంలో ఎగరడం చూసి తన కెమెరాలో క్లిక్ మనిపించాడు.

ఆ తర్వాత ఫోటోలో ఉన్న పక్షులను లెక్కపెడితే మొత్తం 49 రావడంతో ఫోటోగ్రాఫర్ ఆశ్చర్యపోయాడు. దీంతో ఈ ఫోటోను సీఎన్ఎన్ ప్రముఖంగా ప్రసారం చేసింది. సీఎన్ఎన్ ఛానెల్‌కు చెందిన ఓ మహిళా ఫోటోగ్రాఫర్ ఇంత గొప్ప ఫోటోను తీసింది. అయితే ఫొటోగ్రాఫర్ మాత్రం తన వివరాలు గోప్యంగా ఉంచాలని కోరడం గమనార్హం.
సరిగ్గా కాల్పుల ఘటనలో ఎంతమంది మృతి చెందారో ప్రకటిస్తున్న సమయంలో ఆకాశంలో ఎగురుతున్న పక్షులను తాను ఫొటో తీశానని, తర్వాత లెక్కపెడితే సరిగ్గా 49 ఉండటం తననూ ఆశ్చర్యానికి గురిచేసిందని ఫొటోగ్రాఫర్ తెలిపింది. సరిగ్గా నివాళులు అర్పిస్తున్న సమయంలోనే పక్షులు ఆకాశంలో ఎగురడం అక్కడున్న వారందరినీ కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications