Tomato: షాకిస్తున్న టమాటా ధరలు.. కిలో రూ.1500..!
టమాటా ధరలు షాకిస్తున్నాయి. కిలో టమాటా ఏకంగా రూ.1500 దాటిపోయింది.
కూరగాయాల్లో విరివిగా వాడే కూరగాయ అంటే ఏం చెబుతాం.. ఏముంది టమాటా అని చెబుతాం.. అలాంటి టమాటా కిలో రూ.1500 ఉంటే.. అవును ఇది నిజం కిలో టమాటా పదిహేను వందల రూపాయలకు పైగా పలుకుతుంది. కానీ మన దగ్గర కాదు.. బ్రిటన్ లో.. ఈ ఇంగ్లాండ్ ఏడాది కాలంలో టమాట ధరలు విపరీతంగా పెరిగాయి. గతేడాది 5 పౌండ్లు ఉన్న కిలో టమాటా ప్రస్తుతం 20 పౌండ్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.1981 కి చేరాయి. టమాటా ధరలు పెరగడం వల్ల పిజ్జా మార్కెట్ పై ప్రభావం పడింది. పిజ్జా, సాస్ తయారీలో ఎక్కువగా టమాటాను వినియోగిస్తుంటారు. టమాటా ధరలు పెరగడంతో.. వ్యాపారులు పిజ్జా ధరలను అమాంతం పెంచారు.
బ్రిటన్ తో పాటు ఇటలీలోనూ టమాటా కొరత కనిపిస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో టమాటాలకు కొరత ఏర్పడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. బ్రిటన్ సాధారణంగా డిసెంబర్ నుంచి మార్చి వరకు దాని టమోటాలలో 95 శాతం, పాలకూరలలో 90 శాతం దిగుమతి చేసుకుంటుంది. ఇది శీతాకాలంలో టమోటాల కోసం మొరాకో స్పెయిన్ వంటి దేశాలపై ఇంగ్లాండ్ ఆధారపడుతుంది. దక్షిణ స్పెయిన్ అసాధారణంగా వాతావరణంతో కూరగాయల దిగుబడి తగ్గింది. దీంతో ఆయా దేశాలు ఎగుమతులను నిలిపివేశాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రెస్టారంట్ల నిర్వాహకులు దొరికినకాడికి ఏవో నాసిరకమైన టమాటాలను తెప్పించి వాడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

కొందరు నిర్వాహకులు మాత్రం టమాటాలకు బదులు వేరే కూరగాయలతో పిజ్జాలు చేసి కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తున్నారు. అయితే, వీటిని కస్టమర్లు పెద్దగా ఇష్టపడటం లేదని తెలుస్తోంది. దీంతో కొన్ని రెస్టారెంట్లలో పిజ్జాను తమ మెనూ నుంచి తొలగించారు. దక్షిణ ఐరోపా మరియు ఉత్తర ఆఫ్రికాలోని క్లిష్ట వాతావరణం అనేక రకాల పంటల కోతకు అంతరాయం కలిగించిందని రాయిటర్స్ నివేదించింది.ఇంగ్లాండ్ లోనే కాదు మన దగ్గర కూడా టమాటా రేట్లు పెరిగాయి. బ్రిటన్ స్థాయిలో కాకున్నా కాస్త పెరిగాయి. మొన్నటి వరకు కిలో రూ.15 పలికిన టమాటా ఇప్పుడు కిలో రూ.30 నుంచి రూ.40 పలుకుతోంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications