కుక్కకు ఎనిమిది ఐఫోన్ 7ఎస్ లు గిఫ్ట్ గా ఇచ్చిన బిలియనీర్..
బీజింగ్ : చైనాకు చెందిన ఓ బిలియనీర్ కొడుకు తన కుక్కకు ఏకంగా.. అత్యంత విలువైన ఎనిమిది ఐఫోన్7ఎస్ ఫోన్లను బహూకరించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వీటి విలువ సుమారు రూ.6.50లక్షలు కాగా.. మార్కెట్ లోకి విడుదలైన తొలిరోజే ఈ ఫోన్లను సదరు బిలియనీర్ కొడుకు తన కుక్కకు బహూకరించాడు.
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే.. చైనాలో అత్యంత సంపన్నుడిగా పేరున్న దాలియాన్ వాండా గ్రూప్ చైర్మన్ వాంగ్ జియాన్లిన్ కుమారుడు వాంగ్ సికాంగ్. తన పెంపుడు కుక్క అంటే వాంగ్ సికాంగ్ కు వల్లమాలిన ప్రేమ. అందుకే.. ఈ ఐఫోన్ 7ఎస్ ఫోన్లను బహూకరించి కుక్క పట్ల తన ప్రేమను చాటుకున్నాడట.

తాను బహూకరించిన ఫోన్ల ముందు తన పెంపుడు కుక్కను కూర్చోబెట్టి.. ఫోటోలు కూడా క్లిక్ మనిపించాడు. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలో పాపులర్ అయిన వీబో సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ కుక్కకు 19 లక్షల ఫాలోవర్స్ ఉండడం గమనార్హం. ఎంతైనా బిలియనీర్స్ పెంచుకునే కుక్కలు కూడా సెలబ్రిటీలే అన్నమాట. మరింతకీ ఆ ఫోన్లంటితో కుక్క ఏంచేస్తుంది?












Click it and Unblock the Notifications