వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ ఆంటీతో పెట్టుకున్నాడు: సినిమా చూపించింది

|
Google Oneindia TeluguNews

హల్(యూకే): పంజాబీ మహిళలు తెగిస్తే ఎంతవరకైనా సిద్దంగా ఉంటారని మరో సారి వెలుగు చూసింది. ఏడు అంగుళాల కత్తి చేతపట్టుకుని నేనే పెద్దపోటుగాడు అంటూ రెచ్చిపోయిన ఓ దొంగకు పంజాబీ ఆంటీ చుక్కలు చూపించింది.

యూకేలోని హల్ ప్రాంతంలో కరంజిత్ సంఘా (49) అనే మహిళ ఓ కిరాణ దుకాణం నిర్వహిస్తున్నది. ఆమె క్యాష్ కౌంటర్ దగ్గర కుర్చుని టీ తాగుతుంది. అదే సమయంలో స్టువర్ట్ గ్లీసన్ అనే దొంగ కిరాణ దుకాణంలోకి వెళ్లాడు.

కిచెన్ లో ఉపయోగించే ఓ కత్తి తీసుకుని క్యాష్ కౌంటర్ లో ఉన్న డబ్బులు మొత్తం ఇవ్వాలని ఆమెను బెదిరించాడు. అయితే కరంజిత్ సంఘా తాపీగా టీతాగుతూ కొంత సేపు వెయిట్ చెయ్యి అని చెప్పిన ఆమె దొంగను పట్టించుకోలేదు.

Thief Threatens to stab Ounjabi aunty in UK

అంతే స్టువర్ట్ గ్లీసన్ రెచ్చిపోయాడు. మార్యాదగా టీ కిందపెట్టి డబ్బులు ఇవ్వాలని లేదంటే పోడిచేస్తానని బెదిరించాడు. అంతవరకు సహనంగా ఉన్న కరంజిత్ సంఘా చేతికి చిక్కిన చిన్నపాటి కత్తి తీసుకునింది.

దొంగకు గాయం కాకుండా కత్తి అటూ ఇటూ తిప్పుతూ అతనికి సినిమా చూపించింది. దేవుడా నాకంటే పెద్ద ముదురుగా ఉన్నట్లుంది అంటూ అక్కడి నుంచి పరుగుతీశాడు. పారిపోతున్న స్టువర్ట్ గ్లీసన్ ను స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటన ఈ సంవత్సరం మే 26వ తేదిన జరిగింది. ఈ విషయంపై నమోదు అయిన కేసును విచారించిన న్యాయస్థానం అక్రమంగా కత్తి పెట్టుకున్నాడని, దొంగతనం చెయ్యడానికి ప్రయత్నించాడని వెలుగు చూడటంతో స్టువర్ట్ గ్లీసన్ కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

English summary
This 49-year-old Punjabi aunty Karamjit Sangha who owns a News and Booze store in UK.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X