రైల్వేస్టేషన్ అంటే ఇదే... దీన్ని మించింది లేదు!
ఆ రైల్వేస్టేషన్ లో మొత్తం 44 ప్లాట్ ఫామ్స్ ఉంటాయి. ప్రతిరోజు ఈ స్టేషన్ మీదుగ 660 రైళ్లు ప్రయాణిస్తుంటాయి. రోజుకు 1.25 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. ఇన్నిరకాల ప్రత్యేకతలతో ఈ స్టేషన్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఇదేమీ నిన్నామొన్నా కట్టిన స్టేషన్ కాదు. దీన్ని నిర్మించి 122 సంవత్సరాలైంది. అత్యంత పొడవైన రైల్వేస్టేషన్ గా కూడా పేరు తెచ్చుకుంది. ఇంతకీ అది ఎక్కడుందంటే అమెరికాలోని న్యూయార్క్ లో. ఈ నగరంలోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ రైల్వే స్టేషన్ ను మించిన స్టేషన్ ప్రపంచంలో ఎక్కడా లేదు.
48 ఎకరాల్లో విస్తరించింది
భూమిపైనే కాకుండా భూమి లోపల కూడా ప్లాట్ ఫామ్స్ ఉంటాయి. మొత్తం 48 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. అత్యంత చారిత్రక స్టేషన్ గా నిలిచిన ఈ స్టేషన్ నిర్మాణాన్ని 1903లో మొదలుపెట్టి 1913లో పూర్తిచేశారు. ఇందులో చాలా సీక్రెట్ గా ఉంటే వాల్ డార్ఫ్ ప్లాట్ ఫామ్స్, వింత వింత, విచిత్రమైన వస్తువులకు ప్రసిద్ధి చెందిన లాస్ట్ అండ్ ఫౌండ్ డిపార్ట్ మెంట్ కూడా ఉంటుంది. ప్రపంచంలోనే కీలకమైన మైలురాయిగా నిలిచి అమెరికాకు ఈ స్టేషన్ మంచిపేరు తెచ్చిపెట్టింది.

కింద 26 ట్రాకులు, పైన 41 ట్రాకులు
గ్రౌండ్ ఫ్లోర్ లో 26 ట్రాకులుంటాయి. 1వ అంతస్తులో 41 ట్రాకులుంటాయి. ఈ రెండింటిలో రైళ్లు ప్రయాణిస్తాయి. దీనివల్ల ప్రయాణికులు ఎంత భారీ సంఖ్యలో వచ్చినా రద్దీని చాలా సులభంగా నియంత్రించడానికి అవకాశం ఉంది. అంతేకాదు.. ఒకేసారి ఎక్కువ రైళ్లు ప్రయాణిస్తాయి. న్యూయార్క్‌లోని పార్క్ అవెన్యూ, 42వ స్ట్రీట్ లో ఉన్న ఈ టెర్మినల్ నిర్మాణ అద్భుతమని.. సాంస్కృతిక చిహ్నమని ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం మనదేశంలో ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న రైల్వేస్టేషన్ 1500 ఎకరాల్లో నిర్మాణం జరుపుకోబోతోంది. ఇందులోని సౌకర్యాలన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత న్యూయార్క్ స్టేషన్ ను ఏవిధంగా అధిగమిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications