ఓరి దేవుడో: ఈయనకు 17 మంది భార్యలు... 84 మంది పిల్లలట..!
ఈ రోజుల్లో ఒక పెళ్లితోనే తల ప్రాణం తోకకు వచ్చేస్తోందంటూ చెప్పే మగవారిని చూస్తున్నాం. అలాంటిది రెండు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకుని కాపురం చేసే మగవారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించొచ్చు. కానీ యూఏఈకి చెందిన దాద్ మోహ్మద్ అల్ బలూషీ మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మందిని పెళ్లి చేసుకుని 84 మంది పిల్లలకు జన్మనిచ్చాడు. ఇంతకీ బలూషి వయస్సు ఎంతో తెలుసా.. అక్షరాల 71 ఏళ్లు. ఇప్పటికే బలూషీకి 50 మంది మనవళ్లు మనవరాండ్రు ఉన్నారు.
తను ఒక మంచి తండ్రిని అని బలూషీ చెప్పుకుంటారు. తను ఇతర దేశాల మహిళలను వివాహం చేసుకున్నట్లు చెప్పాడు. ఫిలిప్పీన్స్ మోరొక్కో, పాకిస్తాన్ ఇలా అన్ని దేశాలకు చెందిన మహిళలను వివాహం చేసుకున్నట్లు చెప్పారు. అయితే విడాకులు తీసుకున్న మహిళలను, లేదా భర్తకోల్పోయిన మహిళలను తాను పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేశారు. అయితే తాను పెళ్లి చేసుకున్న ప్రతి భార్య వారి పిల్లలతో కలిసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు బలూషీ తెలిపాడు. ప్రతి భార్యకు ఒక ఇళ్లు ఉందని దాంతో పాటు ఒక కారు, పనిమనిషి కూడా ఉందని చెప్పాడు.

ఇక తామంతా వారంలో ఒకరోజు మనమాలోని తన పాత ఇంటిలో కలుస్తామని చెప్పారు. జనన మరణాలు భగవంతుడి చేతిలో ఉంటాయని చెబుతున్న బలూషీ... అన్నీ సవ్యంగా సాగితే వంద మంది పిల్లలకు జన్మనిస్తానని చెబుతున్నాడు. తాను మృతి చెందే నాటికి 100 మంది పిల్లలకు తండ్రినవుతానని తాను యూఏఈ దివంగత రాజు షేక్ జైద్‌కు మాట ఇచ్చినట్లు చెప్పారు.ఇదిలా ఉంటే 1995లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బలూషీ ఓ కాలును పోగొట్టుకున్నట్లు చెప్పాడు. ఆర్టిఫిషియల్ కాలు కోసం జైపూర్‌కు వెళ్లాలని భావిస్తున్నట్లు బలూషీ చెప్పారు. భారత్‌లో కూడా ఓ మహిళ కోసం చూసి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇక తన తండ్రి 110 ఏళ్లు బతికినట్లు చెప్పిన బలుషీ అతనికి నలుగురు భార్యలని 27 మంది సంతానం అని చెప్పాడు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications