ఇరాన్ పై ఇజ్రాయెల్ పై దాడి ఎఫెక్ట్-వెంటనే గగన తలం మూసేసిన 3 దేశాలు..!
ఇరాన్ గతంలో తమపై జరిపిన డ్రోన్ల దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇవాళ టెహ్రాన్ పై విరుచుకుపడింది. ఈ దాడిలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో భారీగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్ లో ఏ స్ధాయిలో నష్టం జరిగిందన్న వివరాలు బయటికి రాలేదు. కానీ ఇజ్రాయెల్ మాత్రం దీన్ని పరిమిత దాడిగానే పేర్కొంది. అయితే ఈ దాడి సమాచారం తెలియగానే మూడు దేశాలు తమ గగనతలాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించాయి.
ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇతర నగరాల్లోని సైనిక స్థావరాలపై ఇవాళ తెల్లవారుజామున ఇజ్రాయెల్ క్షిపణుల దాడి జరిగింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై 200కు పైగా రాకెట్లు, బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇవాళ ప్రతిదాడి చేసింది. అయితే తెల్లవారుజామున టెహ్రాన్ పై జరిగిన దాడులు పరిమిత నష్టాన్ని కలిగించాయని ఇరాన్ క్లారిటీ ఇచ్చింది.

అయితే ఈ సమాచారం తెలియగానే ఇరాన్ తో పాటు వారి మిత్రదేశాలు సిరియా, ఇరాక్ కూడా తమ గగనతలాన్ని మూసేశాయి.
ఫ్లైట్ రాడార్ 24 ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకారం, మూడు దేశాల మీదుగా ఏ విమానమూ ప్రయాణించడం లేదు. అయితే దాడుల తర్వాత విమానాలను తిరిగి ప్రారంభిస్తామని ఇరాన్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. సిరియా రాజధాని డమాస్కస్‌పై ఆక్రమిత గోలన్ హైట్స్, లెబనాన్ నుండి ఇజ్రాయెల్ వైమానిక దాడులను ప్రారంభించిందని, ఇది వాయు రక్షణ వ్యవస్థలను యాక్టివ్ చేయడానికి వారిని ప్రేరేపించినట్లు తెలిపారు.
-
మరో రెండు రోజుల్లో ఏదైనా జరగొచ్చు: ట్రంప్ కీలక ప్రకటన -
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? -
అమెరికా vs ఇరాన్: మళ్లీ చర్చలకు సన్నద్దమవుతున్న దాయాదులు! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications