హృదయాన్ని కదిలించిన ప్రేమ వివాహం

ఫిలిప్పీన్స్: ఏ వ్యక్తికైనా వివాహం అనేది ఓ మరుపురాని సందర్భం. జీవితాంతం గుర్తుపెట్టుకునే ఆ క్షణాలు ఎంతో ఆనందబరితంగా ఉంటాయి. జీవితాంతం ఒకరికొకరు తోడు నీడగా ఉంటామనీ ప్రమాణం చేసుకుంటారు. కానీ ఓ వ్యక్తి జీవితంలో పెళ్లయిన క్షణాలే చివరివిగా మిగిలిపోయాయి. ఈ విషయం అతనికీ, అతన్ని వివాహం చేసుకునే అతని ప్రియురాలికీ తెలుసు. దీంతో ఎంతో ఆనందంగా చేసుకోవాల్సిన వివాహ వేడుకను కన్నీళ్లతో ఆవేదనతో జరుపుకున్నారు.

Till Death Do Us Part: This Fairytale Wedding Will Break Your Heart

ఫిలిప్పీన్స్‌కు చెందిన రౌడెన్ గో.. అతని భాగస్వామి లెజైల్ మే.. వారి రెండేళ్ల కుమార్తె జాకియా రౌజెల్ వీరిది ఓ అందమైన ఆనందం నిండిన కుటుంబం. రౌడెన్ 30వ పుట్టిన రోజైన జులై 8న వీరిద్దరూ వివాహం జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే విధి వీరిపై కన్నెర్ర చేసింది. రౌడెన్ ఆశలను అడియాశలు చేసే చేదు నిజం ఒకటి కొద్ది రోజుల క్రితమే వారికి తెలిసింది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/eVocnNIgKwY?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

రోడెన్‌కు లివర్ కేన్సర్ ఉందని, అది కూడా స్టేజ్ 4లో ఉందని. దీంతో అతడు ఆస్పత్రికే పరిమితమైపోయాడు. అయితే రౌడెన్ కోరిక తీర్చాలని అతని కుటుంబసభ్యులు, స్నేహితులు నిర్ణయించుకున్నారు. ఆస్పత్రి నుంచి రౌడెన్‌ను తీసుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో అక్కడే వారి వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. 12గంటలు కష్టపడి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రిలోనే సాంప్రదాయబద్ధంగా రౌడెన్-లెజైల్ మేల వివాహం చేశారు.

లెజైల్ మే తన కళ్లల్లో వస్తున్న కన్నీళ్లను దిగమింగుకుని రౌడెన్‌ను వివాహం చేసుకుంది. కాగా, పెళ్లయిన పది గంటలకే రౌడెన్ తుది శ్వాస విడిచాడు. దీంతో అక్కడంతా విషాదం అలుముకుంది. హృదయాన్ని కదిలించే రౌడెన్-లెజైల్‌ల వివాహం ఇప్పుడు యూట్యూబ్‌లో ఓ సంచలనంగా మారింది. జూన్ 18న అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 40 లక్షల మంది వీక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+