viral video:వాట్ ఏ వెల్ మ్యానర్ చైల్డ్.. అడగకుండా ఐస్‌క్రీమ్ తీసిన డ్యాడ్, ఏం చేసిందంటే.. వైరల్
తినే పదార్థాల విషయంలో కాస్త కఠినంగానే ఉంటారు కొందరు. తమకు కావాల్సిన వారికి కూడా ఇవ్వరు. మరికొందరు అయితే ప్రియమైన వారికి ఇవ్వడానికి ఓకే చెబుతారు. పిల్లలు అంటే చాక్లెట్లు, ఐస్ క్రీమ్సే కదా.. సో.. తన కూతురు ఐస్ క్రీమ్ ఇస్తోందా లేదా అని ఓ డ్యాడ్ టెస్ట్ చేశారు. ఆ చిన్నారి చాలా చక్కగా రియాక్షన్ ఇచ్చింది. బాగుంది కదా నాన్న అంటూ కామెంట్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఐస్ క్రీమ్ తీసుకున్న డ్యాడీ
అమెరికాకు చెందిన కమెడీయన్ ఆస్టిన్ గిటర్.. అతనికి రెండేళ్ల కూతురు ఉంది. పిల్లలు అంటే ఐస్ క్రీమ్ లాగించడమే కదా.. అలా ఆమె తినేస్తోంది. ఇంతలో ఆస్టిన్ కూడా మెల్లగా తీసుకున్నాడు. అయితే ఆమెకు చెప్పలేదు. అతనిని చూసిన చిన్నారి.. బాగుంది కదా నాన్న అని అంది. వీడియో ఇన్ స్టాగ్రామ్ రీల్స్‌లో పోస్ట్ చేశారు. ఇంకేముంది 3.6 మిలియన్ల వ్యూస్.. 312 కే లైక్స్ వచ్చాయి.

అడగకుండా ఐస్ క్రీమ్ తీసుకోవడంతో..
చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. చిన్నారిని అడకకుండా ఐస్ క్రీమ్ తీశాడు. తర్వాత చిన్నారి క్యూట్ లుక్ ఇచ్చింది. మీరు ట్రై చేయండి అనింది. బాగుంది కదా అని ఎంకరేజ్ చేసింది. ఆ చిన్నారి.. ఐస్ క్రీమ్ తీసుకున్న ఇబ్బంది పడలేదు. తన నాన్నకు ఐస్ క్రీమ్ ఇచ్చేసింది. చిన్నారి ఐస్ క్రీమ్.. ఆమె కళ్లతో మ్యాచ్ అయ్యింది. వాట్ ఏ స్వీట్, వెల్ మ్యానర్డ్ చైల్డ్ అని కొందరు కామెంట్ చేశారు.

ఒక మెతుకు ఇచ్చేసి
ఇదీ ఇలా ఉంటే మరో వీడియోను ఆస్టిన్ షేర్ చేశారు. ఆ వీడియోలో చిన్నారి అన్నం తింటుంది. తనకు అన్నం కావాలని అడగగా.. కేవలం ఒక మెతుకు ఇచ్చింది. తర్వాత ఆమె మాత్రం ఒక బుక్క తినేసింది. దీంతో అక్కడున్న అతని భార్య, అతను నవ్వేశారు. వారిని చూసి చిన్నారి కూడా స్మైల్ ఇచ్చింది. ఈ రెండు వీడియోలు చాలా చక్కగా ఉన్నాయి. చిన్నారి.. చాలా అందంగా కనిపించింది.












Click it and Unblock the Notifications