మరీ ఇంత హాట్ గా ఉంటే ఊరుకుంటారా..? ఎంత పని చేశార్రా..
సాధారణంగా ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలంటే అర్హత, నైపుణ్యాలు చూస్తారు. వాటి ప్రకారం ఉద్యోగంలో రిక్రూట్ చేసుకుంటారు. కానీ బ్రెజిల్ కు చెందిన అలె గవుచా(21) కు మాత్రం అన్నీ ఉన్నా ఉద్యోగం రావడం లేదు. జాబ్ కు తగ్గ క్వాలిఫికేషన్ ఉంది. స్కిల్స్ కూడా ఉన్నాయి. అయితే వీటితో పాటు ఆమెకు విపరీతమైన అందం కూడా ఉంది. ఇంత అందమైన అమ్మాయిని తాము రిక్రూట్ చేసుకోలేము అంటూ 50 కంపెనీలు రిజెక్ట్ చేశాయి. ఈ మేరకు గవుచా చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. స్కిల్స్, క్వాలిఫికేషన్ ఉన్నా అందం కారణంగా తనను 50 ఇంటర్వ్యూల్లో రిజెక్ట్ చేశారని చెప్పుకొచ్చింది.
బ్రెజిల్ కు చెందిన అలె గవుచా(21) ఇప్పటివరకు 50 కు పైగా ఇంటర్వ్యూల్లో పాల్గొంది. కానీ ఆమెకు జాబ్ ఇచ్చేందుకు కంపెనీలు నిరాకరిస్తున్నాయి. అందుకు కారణం ఆమె అందంతో పాటు ఆకర్షణీయంగా ఉండటమే. కేర్ టేకర్ పోస్టులకు ఆమె అప్లై చేసింది. అంటే ఓ ఇంట్లో భార్యాభర్తలు ఉద్యోగానికి వెళ్లినప్పుడు ఇంట్లోని పెద్దవాళ్లను లేదా చిన్న పిల్లలను చూసుకునే పని అని అర్థం. అయితే గవుచాను నియమించుకుంటే ఆమె అందం కారణంగా వివాహేతర సంబంధాలు తలెత్తుతాయని ఇంట్లోని మహిళలు భయపడుతున్నారు. ఈ కారణంతోనే తనకు ఉద్యోగం ఇచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదని అలె గవుచా తెలిపింది.

ప్రస్తుతం అలె గవుచా అడల్ట్ కంటెంట్ క్రియేటర్ గా ఉద్యోగం చేస్తోంది. తన కంటెంట్ తో సామాజిక మాధ్యమాల్లో లక్షల్లో ఫాలోవర్స్ ను సంపాదించింది. ఉద్యోగం కోసం తాను ఇంటర్వ్యూల్లో హాజరైనప్పుడు మొదట్లో వాళ్లు రిజెక్ట్ చేస్తుంటే తనకు అనుభవం లేని కారణంగా అలా చేస్తున్నారేమో అనుకునేదాన్ని అని కానీ తన అందం కారణంగానే రిజెక్ట్ చేస్తున్నట్లు తర్వాత తెలిసినట్లు చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications