Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Total Solar Eclipse: విమానంలో నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం-ఐఎస్ఎస్ నుంచీ- వీడియోలు వైరల్..

ఉత్తర అమెరికాలో ఖగోళ వింతగా భావిస్తున్న సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది. అమెరికాతో పాటు మెక్సికో, కెనడాలోని పలు నగరాల్లో సూర్యగ్రహణం కనిపించింది. అంతే కాదు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో శాస్త్రవేత్తలతో పాటు పలు విమానాల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా దీన్ని తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఇప్పుడు ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. సంపూర్ణ సూర్యగ్రహణం దాదాపు 4 నిమిషాలకు పైగా సాగింది. దీంతో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేశాడు.

total solar eclipse crossed north america- wonderful videos gone viral


ఈ ఏడాది ఖగోళ వింతగా భావించిన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని తిలకించే అదృష్టం ఉత్తర అమెరికా వాసులకు మాత్రమే కలిగింది. దీంతో వారు ఆ అరుదైన ఘటన కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. అనుకున్న క్షణం రానే వచ్చింది. దీంతో ఎవరికి వారు సెల్ ఫోన్లలో ఈ అరుదైన గ్రహణాన్ని బంధించేందుకు పోటీ పడ్డారు. దీంతో ఈ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్య గ్రహణాన్ని దాదాపు పది మిలియన్ల మంది ప్రజలు వీక్షించారని అంచనా. చంద్రుని నీడ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:07 గంటలకు (1807 GMT) మెక్సికోలోని పసిఫిక్ తీరాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టింది, ఆపై సూపర్సోనిక్ వేగంతో అమెరికా అంతా వ్యాపించింది. కెనడాలోని అట్లాంటిక్ తీరం మీదుగా కేవలం గంటన్నరలోపు సముద్రానికి తిరిగి వచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+