భార్య విడాకులు ఇచ్చిందని 100 బీర్లు తాగాడు.. చివరికి..

పెళ్లంటే నూరేళ్ల పంట అని నానుడి ఉంది. కానీ ప్రస్తుత కాలంలో పెళ్లంటే నూరు రోజులు కూడా కాపురాలు నిలబడటం లేదు. ప్రియుడు, ప్రియురాలు మోజులో పడి భార్యాభర్తలు శత్రువులుగా మారిపోతున్నారు. కొందరు లవర్ మాయలోపడి కట్టుకున్న వ్యక్తిని లేపేస్తుంటే.. మరికొందరు విడాకుల రూపంలో ఎవరికివారుగా మిగిలిపోతున్నారు. ప్రస్తుతం ఇదో ట్రెండ్ లా మారిపోయింది. ఈ కారణంగానే పెళ్లంటే యువత ఆసక్తి చూపడం లేదు.

అయితే తాజాగా ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య విడాకులు ఇచ్చిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. ఒక్క నెలలో ఏకంగా 100 బీర్లు తాగాడు. అలా రోజంతా బీర్లు తాగుతూ ఉండేవాడు. ఇంట్లో తల్లిదండ్రులు ఏమి వండి పెట్టినా తినే వాడు కాదు. అలా ఆహారం మానేసి.. కేవలం బీర్లు మాత్రమే తాగేవాడు. అలా అతని శరీరంలోని అవయవాలు క్షీణించాయి. దీంతో ఓ సారి అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన థాయ్‌లాండ్‌ లో జరిగింది.

Tragic End Thai Man Dies After Drinking 100 Beers Post-Divorce

థాయ్ లాండ్ కు చెందిన థవీసక్(44) కు అతని భార్య ఇటీవల విడాకులు ఇచ్చింది. ఆ దంపతులకు 16 ఏళ్ల కుమారుడు ఉండగా అతడ్ని థవీసక్ తోనే ఉంచి వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోయినప్పటి నుంచి బాధతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు థవీసక్. ఆహారం తీసుకోవడం మానేశాడు. కేవలం బీర్లు మాత్రమే తాగేవాడు. అలా అతడి రూమ్ మొత్తం బీర్ బాటిల్స్ తో నిండిపోయింది. కేవలం బీర్లు మాత్రమే తాగేవాడు. అలా అతని శరీరంలోని అవయవాలు క్షీణించాయి. దీంతో ఓ సారి అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం అతని రూమ్ లో దాదాపు 100కు పైగా బీర్ బాటిల్స్ లభ్యం అయినట్లు పోలీసులు తెలిపారు. మద్యం అధికంగా తీసుకోవడం వల్లే థవీసక్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+