ట్రంప్ విజయం ఖరారు - "స్వింగ్" కింగ్..!!

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం దాదాపు ఖాయమైంది. ట్రంప్ తన మద్దతు దారులకు వాచ్ పార్టీలో బిజీగా ఉన్నారు. ఫలితాల సరళితో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ తన ఎన్నికల నైట్ ప్రసంగం రద్దు చేసుకున్నారు. అటు రిపబ్లికన్స్ హ్యాపీ మూడ్ లో కనిపిస్తున్నారు. అధ్యక్షుడిగా గెలవాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించాల్సి ఉంది. ట్రంప్ ఇప్పటికే 251 సాధించి గెలుపుకు దగ్గరయ్యారు. గట్టి పోటీ ఇచ్చిన కమలా హ్యారీస్ 214 సాధించారు. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వారు గెలిచి తమ సత్తా చాటారు.

ఫలితం పై క్లారిటీ
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. తాజా ట్రెండ్స్ విజేత ట్రంప్ గా స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన వారికి పలువురు విజయం సాధించారు. కాలిఫోర్నియా యుఎస్ హౌస్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో భారత సంతతి డెమోక్రటిక్ ప్రతినిధి రౌ ఖన్నా విజయం సాధించారు. కాలిఫోర్నియాకు చెందిన రౌ ఖన్నా రిపబ్లికన్ అనితా చెన్‌ను సులభంగా ఓడించారు. ప్రస్తుత సిట్టింగ్ అభ్యర్తి మైక్ హోండాను ఓడించారు. ఇక, అటు
ఓ వైపు అమెరికా ఎన్నికల ఫలితాలు లెక్కిస్తుంటే మరో వైపు పాలస్తీనా అనుకూల నిరసనకారులు వైట్ హౌస్‌ను చుట్టుముట్టారు.

Trends indicate Donald Trump s victory against Kamala Harris as leading in 247 electoral votes

అధ్యక్ష పీఠానికి చేరువగా
గెలుపు ఖాయమనే ధీమాకు వచ్చిన ట్రంప్ వాచ్ పార్టీ ఇస్తున్నారు. కెనడీ జూనియర్, మాస్క్ తో సహా పలువురు మద్దతు దారులు హాజరు అయ్యారు. స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ మేజిక్ పని చేసింది. ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ గెలుపొందారు. ట్రంప్‌ కాన్సస్‌, అయోవా, మోంటానా, యుటా, నార్త్‌ డకోటా, వయోమింగ్‌, సౌత్‌ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్‌, ఆర్కాన్సాస్‌, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్‌ వర్జీనియా, అలబామా, సౌత్‌ కరోలినా, ఫ్లోరిడా, ఐడహో.. 23 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించారు. కాలిఫోర్నియా, వాషింగ్టన్‌ సహా ఇల్లినోయీ, న్యూజెర్సీ, మేరీల్యాండ్‌, వెర్మాంట్‌, న్యూయార్క్‌, కనెక్టికట్‌, డెలవేర్‌, మసాచుసెట్స్‌, రోడ్‌ ఐల్యాండ్‌, కొలరాడో, డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియాను హరీస్ గెలుపొందారు.

సెనెట్ రిపబ్లికన్ల ఖాతాలో
అమెరికన్ సెనెట్‌లో 100 స్థానాలకు గాను ప్రస్తుతం రిపబ్లికన్‌ పార్టీ 51, డెమోక్రటిక్‌ పార్టీ 42 స్థానాలను కైవసం చేసుకున్నాయి. మరో 7 స్థానాల ఫలితాలు రావాల్సి ఉంది. ఇక్కడ మెజార్టీ సీట్లను రిపబ్లికన్‌ పార్టీ సాధించడంతో సెనెట్‌ లో పూర్తి ఆధిక్యత సాధించారు. నార్తర్న్‌ వర్జీనియా పదో కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి భారత అమెరికన్‌, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి సుహాస్‌ సుబ్రహ్మణ్యం గెలుపొందారు. ఒబామా హయాంలో ఆయన సాంకేతిక విధాన సలహాదారుగా పని చేశారు. ఇల్లినోయీ రాష్ట్రాన్ని డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ దక్కించుకున్నారు. ఇక్కడి ఎనిమిదో కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి భారత సంతతి వ్యక్తి, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ది చెందిన రాజా కృష్ణమూర్తి విజయం సాధించారు. కాలిఫోర్నియా, వాషింగ్టన్‌ లలో కమలా హారిస్‌ గెలుపు సాధించారు.

Trends indicate Donald Trump s victory against Kamala Harris as leading in 247 electoral votes
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+