ఈసారి ట్రంప్ షాకులు వీరికే..భారతీయులపై తీవ్ర ప్రభావం..!

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు ఏదో విధంగా షాకులిస్తూనే ఉన్నారు. ఇప్పటికే జన్మతః పౌరసత్వం నిబంధనను రద్దు చేసిన ట్రంప్.. దీనిపై న్యాయపోరాటానికి సైతం సిద్దమవుతున్నారు. అదే సమయంలో భారతీయ వలసదారుల్ని గుర్తించి వారిని వెనక్కి పంపేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే భారతీయులకు అమెరికాలో మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చు.

అమెరికాకు అక్రమ వలసల్ని నిరోధించడం, ఇప్పటికే పాగా వేసిన వారిని తరిమేసేందుకు ఉన్న అన్ని అవకాశాల్ని పరిశీలిస్తున్న ట్రంప్ సర్కార్ అందుకు అనుకూలంగా దొరికే ఏ చిన్న అవకాశం వదులుకోవడం లేదు. ఇందులో భాగంగా గత బైడెన్ సర్కార్ ఇచ్చిన ఓ వెసులుబాటును రద్దు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్దమవుతోంది. గతంలో హెచ్ 1 వీసాదారుల జీవిత భాగస్వాములు, గ్రీన్ కార్డ్ దరఖాస్తు దారులకు వర్క్ పర్మిట్లను 540 రోజులకు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ సర్కార్ వెనక్కి తీసుకోబోతోంది.

trouble for Indian H1B spouses green card applicants as work permit extension to slash to 180 days

గతంలో ఇలా హెచ్ 1 వీసాదారుల జీవిత భాగస్వాములకు, గ్రీన్ కార్డు దరఖాస్తు దారులకు 180 రోజులుగా ఉన్న వర్క్ పర్మిట్ పొడిగింపు గడువును అప్పట్లో అధ్యక్షుడు బైడెన్ 540 రోజులకు పెంచారు. ఇప్పుడు ట్రంప్ మళ్లీ దాన్ని 180 రోజులకు కుదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు, జాన్ కెన్నెడీ, రిక్ స్కాట్, వర్క్ పర్మిట్‌ల ఆటోమేటిక్ పునరుద్ధరణను 180 రోజుల నుండి 540 రోజులకు పొడిగించే బిడెన్ హాయాం నాటి రూల్ ను రద్దు చేసేలా ఓ తీర్మానాన్ని కాంగ్రెస్ లో ప్రవేశపెట్టారు.

ఇమ్మిగ్రేషన్ చట్టాల అమలుకు బైడెన్ ప్రభుత్వ నిర్ణయం విఘాతం కలిగిస్తుందని సెనేటర్లు వాదిస్తున్నారు. ఈ వెసులుబాటుతో
అమెరికాలో అక్రమ వలసదారులకు స్థానిక అధికారులకు నివేదించకుండా ఉండటానికి మరింత సమయం ఇవ్వడం తమ ఇమ్మిగ్రేషన్ చట్టాలకు ఆటంకం కలిగిస్తుందన్నారు. ఈ నిబంధనను రద్దు చేయకుంటే, అమెరికాలో చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న వ్యక్తులను ట్రాక్ చేయడం, గుర్తించడం కష్టతరం కావచ్చని వీరు వాదిస్తున్నారు. దీంతో ట్రంప్ సర్కార్ ఈ వెసులుబాటును రద్దు చేసేందుకు సిద్దమవుతోంది. అదే జరిగితే భారతీయులపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందని అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+