మాజీ ప్రధాని వైరల్ వీడియో.. మామూలోడు కాదు బాబోయ్..
వీళ్లను చూసి ఏ బాలీవుడ్ జంటో, లేక హాలీవుడ్ జంటో అనుకుంటే పొరబడినట్లే. ఆయన ఓ దేశానికి మాజీ ప్రధాని.. ఆమె పాప్ సింగర్.. ఇద్దరూ డేటింగ్ లో బిజీబిజీగా గడిపారు. సముద్రం మధ్యలో పడవపై ఎంజాయ్ చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పాప్ సింగర్ కేటీ పెర్రీ , కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో ఇద్దరూ సముద్రం మధ్యలో ఓ పడవపై రొమాన్స్ చేస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. కాలిఫోర్నియాలోని శాంటా బర్బారా తీర ప్రాంతంలో వీళ్లు కెమెరాకు చిక్కారు. దీంతో వీళ్లిద్దరూ కొత్త జీవితంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అయ్యారంటూ నెట్టింట వార్తలు వస్తున్నాయి.

పాప్ సింగర్ కేటీ పెర్రీ.. తన భర్త ఓర్లాండో బ్లూమ్ తో విడాకులు తీసుకుంది. అలాగే కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో తన సతీమణి సోఫీ గ్రెగోయిర్ తో డివోర్స్ తీసుకుని విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో కేటీ పెర్రీ.. జస్టిన్ ట్రూడో మధ్య రిలేషన్ గురించి ఇప్పటికే పలుమార్లు చర్చలు వచ్చాయి. అయితే తాజాగా కాలిఫోర్నియాలోని శాంటా బర్బారా సముద్ర తీరంలో వీళ్ల డేటింగ్ ఫొటోలు ఇంటర్నెట్ ను ప్రస్తుతం షేక్ చేస్తున్నాయి. పాప్ సింగర్ కేటీ పెర్రీ.. తన భర్త ఓర్లాండో బ్లూమ్ కు జూన్ 2025 లో విడాకులు ఇచ్చింది. వీరికి ఓ పాప ఉంది. ఇక సోఫీ గ్రెగోయిర్ తో జస్టిన్ ట్రూడో ఆగస్టు 2023 లో డివోర్స్ తీసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కుప్పలు తెప్పలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇరువురి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక ఈ ఏడాది జులై నుంచి వీరి డేటింగ్ వార్తలు బయటకు వచ్చాయి. ఈ జంట తొలిసారి మాంట్రియల్ లోని ఓ రెస్టారెంట్ లో కనిపించారు. అక్కడ ఇద్దరూ రెండు గంటలపాటు గడిపినట్లు సమాచారం. అప్పటి నుంచీ వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయంపై ట్రూడో , కేటీలు ఎప్పుడూ స్పందించలేదు.












Click it and Unblock the Notifications