డొనాల్డ్ ట్రంప్ దంపతులకు కరోనా- అధ్యక్ష ఎన్నికలకు ముందు కీలక పరిణామం
అెమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా సోకింది. తాజాగా నిర్వహించిన పరీక్షలల్లో ఆయనతో పాటు భార్య మెలానియాకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. ముందు ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వూలో భార్యకు కరోనా సోకిందని పేర్కొన్న ట్రంప్.. ఆ తర్వాత పరీక్షల ఫలితాల్లో తానూ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సంచలన ప్రకటన చేశారు.
Recommended Video
నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే డెమెక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మొదట్లో చప్పగా మొదలైన ఈ పోరు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఊపందుకుంది. తాజాగా ట్రంప్, బిడెన్‌ల మధ్య జరిగిన అధ్యక్ష అభ్యర్ధుల చర్జాగోష్టి కూడా వ్యక్తిగత విమర్శల వరకూ వెళ్లింది. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల వాతావరణం పతాక స్ధాయికి చేరింది. ఇదే సమయంలో ట్రంప్‌తో పాటు ఆయనతో కలిసి తిరిగిన మెలానియాకు కరోనా సోకడం కలవరపెడుతోంది.

అధ్యక్ష ఎన్నికల్లో బిజీగా గడుపుతున్న ట్రంప్, ఆయన భార్య మెలానియా తాజాగా పరీక్షలు చేయించుకున్నారు. వీటి ఫలితాల్లో ముందుగా మెలానియాకు, ఆ తర్వాత ట్రంప్‌కు కరోనాగా తేలింది. దీంతో వీరిద్దరూ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు మరోవైపు తమ అధ్యక్ష అభ్యర్ధి ట్రంప్‌కు కరోనా సోకిందన్న విషయం తెలియగానే రిపబ్లికన్లలో కలకలం రేగుతోంది. ఇప్పటికే డెమెక్రాట్ అభ్యర్ధి బైడెన్ తనతో హోరాహోరీ తలపడుతున్న నేపథ్యంలో ట్రంప్‌కు కరోనా సోకడంతో అధ్యక్ష ఎన్నికలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి.
-
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్












Click it and Unblock the Notifications