బాంబు పేల్చిన ట్రంప్- 200 శాతం టారిఫ్: నోరెత్తితే ఒట్టు

ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు. ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్.

తనకు నచ్చని దేశాలపై టారిఫ్ ను విధించడంలో వెనుకాడట్లేదాయన. ఇప్పుడు తాజాగా ఫ్రాన్స్‌పై టారిఫ్ కు దిగారు. ఆ దేశంతో దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో టారిఫ్ అస్త్రాన్ని సంధించనున్నారు. అమెరికా ప్రతిపాదించిన బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరడానికి ఫ్రాన్స్ విముఖత వ్యక్తం చేయడం దీనికి కారణమైంది. అమెరికా దిగుమతి చేసుకునే ఫ్రెంచ్ వైన్, షాంపేన్‌పై 200 శాతం టారిఫ్ ను విధిస్తామని ట్రంప్ తాజాగా హెచ్చరించారు.

Trump Announces 200Percent Tariff on French Wines and Champagne

బోర్డ్ ఆఫ్ పీస్ లో ఫ్రెంచ్ సహకారాన్ని తీసుకోవడానికి వెనుకాడబోనని, ఆ దేశాన్ని తన దారికి తెప్పించుకోవడానికి ఆర్థికపరమైన ఒత్తిళ్లను తీసుకొస్తానని అన్నారు. టారిఫ్ ద్వారా ఒత్తిడిని తీసుకొస్తానని తేల్చి చెప్పారు. ఫ్రాన్స్ నుంచి దిగుమతి అయ్యే వైన్, షాంపేన్ పై 200 శాతం టారిఫ్ విధించనున్నట్లు తెలిపారు. వైన్‌లు, షాంపైన్‌లపై 200 శాతం టారిఫ్ విధిస్తాననని, అప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మక్రాన్ ఖచ్చితంగా దారికి వస్తాడని, బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరుతాడని వ్యాఖ్యానించారు.

బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరడానికి ఫ్రాన్స్ అయిష్టతను వ్యక్తం చేసిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ తాజా పరిణామాలు యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఆందోళనలను పెంచింది. అమెరికాకు వైన్ ఎగుమతుల వల్ల భారీగా ఆదాయాన్ని పొందుతోంది ఫ్రాన్స్. ఇది ఆ దేశ ప్రతిష్ట, జాతీయ గుర్తింపుకు చిహ్నంగా పరిగణిస్తుంటారు. వాటిపై ఏకంగా 200 శాతం టారిఫ్ విధించితే రెండు మిత్రదేశాల మధ్య శతాబ్దాల కాలంగా కొనసాగుతూ వస్తోన్న వాణిజ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయనే అభిప్రాయాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+