అమెరికాలో చెత్త జనాలు: వారిక్కడ ఉండకూడదు: భారత్ పై..!!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంలో కఠిన మార్పులను ప్రకటించారు. దేశీయ వ్యవస్థలను పునర్నిర్మించడం, అనధికార వలసలను అరికట్టడం, విదేశీయులపై నిఘాను కఠినతరం చేయడం వంటి విస్తృత లక్ష్యాలలో భాగంగా ఈ నిర్ణయాలను తీసుకున్నారు. 'మూడవ ప్రపంచ దేశాల' నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేయడానికి కృషి చేస్తానని తెలిపారు. వాషింగ్టన్ డీసీలో వైట్‌హౌస్ సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డులపై ఆఫ్ఘన్ జాతీయుడి కాల్పుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

మూడో ప్రపంచ దేశాల నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా పూర్తిగా కోలుకోవడానికి ఇది అత్యవసరమని అన్నారు. జో బైడెన్ జారీ చేసిన మిలియన్ల కొద్దీ అక్రమ అనుమతులను రద్దు చేస్తానని తెలిపారు. దీనికంతటికి గత ప్రభుత్వమే కారణమని వ్యాఖ్యానించారు. బైడెన్ ప్రభుత్వాన్ని స్లీపీ ఆటో పెన్..గా అభివర్ణించారు. అమెరికాను ప్రేమించలేని ఎవరినైనా తొలగిస్తానని ఇదివరకే ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

Trump Calls for Urgent Reverse Migration Strategy

తాజాగా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారాయన. త్వరలో "రివర్స్ మైగ్రేషన్" కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని ప్రకటించారు. అమెరికాలో నివసించడానికి ఏ మాత్రం హక్కు లేని వ్యక్తులను గత జో బైడెన్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అన్నారు. వాటన్నింటినీ కూడా రద్దు చేయనున్నట్లు తెలిపారు. ఎయిర్ ఫోర్స్ వన్ ఆయన విలేకరులతో మాట్లాడారు. కఠిన వలస విధానాన్ని సమర్థించారు. రివర్స్ మైగ్రేషన్ గురించి ప్రస్తావించారు. భారత్ సహా పలు దేశాల పౌరులు అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటోన్నారని పరోక్షంగా గుర్తు చేశారు.

రివర్స్ మైగ్రేషన్ విధి విధానాల గురించి విలేకరులు అడిగినప్పుడు.. అమెరికాలో నివసించే కొన్ని దేశాల వారిని బయటికి పంపించాలనుకుంటున్నానని, త్వరలో దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విడుదల చేస్తానని అన్నారు. జో బైడెన్‌ను అమెరికా చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడిగా అభివర్ణించారు. లక్షలాది మంది చెత్త ప్రజలను మన దేశంలోకి అనుమతించాడని ఆరోపించారు. వారిని బయటికి పంపిస్తానని, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్.. అని వ్యాఖ్యానించారు.

Take a Poll

చెత్త ప్రజలు రావడం వల్ల అమెరికన్లు భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నారని, రాబోయే రోజుల్లో కూడా ఇది కొనసాగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్ గార్డ్ లపై కాల్పులు జరిపిన వ్యక్తి కూడా ఈ చెత్త జనంలో ఉన్నాడని అన్నారు. ఆ జంతువును మన దేశంలోకి అనుమతించకూడదని అని అన్నారు. అనుమతి ఇచ్చిన వారి కంటే ఎక్కువ మంది వలసదారులు అమెరికాలో నివసిస్తోన్నారని, దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తోన్నాయని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+