తెగించిన డొనాల్డ్ ట్రంప్ .. ఇచ్చింది అలాంటి ఇలాంటి షాక్ కాదు మరి !!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్నికి ఆజ్యం పోశారు. ఇప్పటికే ఆయనపై ఒంటి కాలి మీద లేస్తోన్న యూరోపియన్ యూనియన్ దేశాలను మరింత రెచ్చగొట్టారు. తన వైఖరి, పంథా మారలేదని పరోక్షంగా తేల్చి చెప్పారు. దేనికైనా రెడీ అయ్యారు. గ్రీన్ ల్యాండ్ అమెరికాకే చెందుతుందని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించిన ఓ గ్రాఫిక్ ఫొటోను విడుదల చేశారు. దీన్ని తన అధికారిక ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు.
గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా భూభాగంగా కలుపుకోవాలనే తన ప్రయత్నాలను ఆయన పునరుద్ధారించారు. ఇందులో భాగంగా గ్రీన్‌ల్యాండ్, కెనడా, వెనిజులా దేశాలు అమెరికాలో భాగంగా చూపించిన ఓ మ్యాప్‌ను షేర్ చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ శాఖ మంత్రి మార్కొ రుబియోతో కలిసి గ్రీన్ ల్యాండ్ పై జెండా పాతుతున్న ఫొటో అది. అక్కడితో ఆగలేదు ట్రంప్. ఇంకో గ్రాఫిక్ ఫొటోను కూడా రిలీజ్ చేశారు.

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ తదితర నేతలు ఓవల్ ఆఫీసులో కూర్చుని ఉండగా, వెనుక భాగంలో ఈ మార్పులు చేసిన ప్రపంచ పటం కనిపిస్తుంది. గ్రీన్‌ల్యాండ్‌ను కలుపుకునే తన ప్రణాళికపై యూరోపియన్ యూనియన్ పెద్దగా అభ్యంతరం పెట్టదని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. చైనా, రష్యా దూకుడును అడ్డుకోవడానికి గ్రీన్ ల్యాండ్ ను తమకు అందజేయాల్సిన బాధ్యత ఆ దేశాలపై ఉందని అన్నారు.
రష్యా, చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి గ్రీన్‌ల్యాండ్ జాతీయ భద్రతకు అత్యవసరమని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. డెన్మార్క్‌కు తగినంత రక్షణ సామర్థ్యం లేదని ట్రంప్ వాదించారు. గ్రీన్‌ల్యాండ్ గురించి ప్రస్తావించారు. దీన్ని భూభాగం అమెరికా సొంతమని, దాన్ని అమెరికాకు ధారదాత్తం చేయాలని, ఈ పనిని వెంటనే పూర్తి చేయాలని వ్యాఖ్యానించారు ట్రంప్. డెన్మార్క్ భూభాగంపై తన వాదనలు, నోబెల్ శాంతి బహుమతి తనకు లభించకపోవడంపై నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్‌కు లేఖ పంపిన విషయాన్ని కూడా నిర్ధారించారు.












Click it and Unblock the Notifications