Donald Trump: ఇండియా శత్రువులకు ట్రంప్ స్ట్రాంగ్ దమ్కీ.. ఆ రెండు దేశాలకు ఇక చుక్కలే
Tariffs Hike: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. తన టీమ్ కూర్పును కూడా దాదాపు పూర్తి చేశారు. తాను అధికారం చేపట్టిన తర్వాత తీసుకోబోయే చర్యల గురించి కూడా కొన్ని ప్రకటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని విషయాల్లో ముఖ్యంగా భారత IT ఉద్యోగుల వ్యవహారంలో కొంత ఇబ్బంది కలగబోతోందని తెలిసింది. అయితే ఇండియా శత్రుదేశాలపై కూడా కీలక చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
చైనా మరియు కెనడా నుంచి అమెరికాలోని వచ్చే వస్తువులపై అధిక టారిఫ్‌లు విధించడంపై ట్రంప్ మాట్లాడారు. తాను అధికారం చేపట్టిన తర్వాత చైనా ఉత్పత్తులపై 10 శాతం, కెనడా వస్తువులపై 25 శాతం మేర సుంకాలు విధిస్తానని చెప్పి షాక్ ఇచ్చారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేస్తానని స్పష్టం చేశారు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్'లో చేసిన వరుస ట్వీట్లలో ఈ విషయాన్ని ప్రకటించారు. జనవరి 20న బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొదటి పని ఇదేనన్నారు. చైనా మరియు కెనడాలతో పాటు మెక్సికోకు ఈ మేరకు షాక్ తగలుతుందని చెప్పారు. మెక్సికో, కెనడా దేశాల నుంచి వేలాది మంది అమెరికాకు వస్తుండగా.. మునుపెన్నడూ లేని స్థాయిలో క్రైమ్, డ్రగ్స్ రవాణా విచ్చలవిడిగా జరుగుతోందన్నారు.
డ్రగ్స్ మరియు క్రైమ్ అంశంపై చైనా ప్రతినిధులతో మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు. అలా చేస్తూ పట్టుబడిన డ్రగ్స్ డీలర్‌కు భారీ శిక్షలు విధిస్తామని డ్రాగన్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే వారు దానిని పాటించలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మునుపెన్నడూ లేని విధంగా మెక్సికో ద్వారా అమెరికాకు డ్రగ్స్ వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications