అధ్యక్ష పీఠాన్ని వదలబోనంటోన్న ట్రంప్- మూడోసారీ ఎన్నికల్లో పోటీకి సై

Donald Trump Asia visit: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఆసియాలో పర్యటిస్తోన్నారు. అయిదు రోజుల పాటు మూడు దేశాల్లో పర్యటించాల్సి ఉంది. మలేషియా పర్యటన ముగిసింది. ప్రస్తుతం ఆయన జపాన్ లో ఉన్నారు. దీని తర్వాత దక్షిణ కొరియాలో అడుగు పెట్టనున్నారు. ఈ ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆసియాలో ఇది ఆయన తొలి పర్యటన కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే- ఆయన చేపట్టిన సుదీర్ఘ విదేశీ యాత్ర కూడా ఇదే.

ఈ సందర్భంగా ఎయిర్ ఫోర్స్ వన్ లో విలేకరులతో మాట్లాడారు. 2028లో మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మూడోసారి పోటీ చేయాలంటూ వైట్‌హౌస్ మాజీ స్ట్రాటజిస్ట్ స్టీవ్ బ్యానన్ చేసిన సూచనల గురించి విలేకరులు ప్రశ్నించగా సానుకూలంగా స్పందించారు. 2028 ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని స్పష్టం చేశారు.

Trump Expresses Ambition for a Third Presidential Term

తొలి టర్మ్ లో సాధించలేని కొన్ని పనులు ఇప్పుడు పూర్తయ్యాయని, అవి మంచి ఫలితాలు ఇచ్చాయని ట్రంప్ బదులిచ్చారు. మూడోసారి కూడా పోటీ చేస్తే బాగుంటుందనే ఆలోచన ఉందని, ఇంకా చాలా సమయం ఉందని, ప్రస్తుతం దీనిపై పెద్దగా దృష్టి పెట్టట్లేదని అన్నారు. తన పదవీకాలం తర్వాత రిపబ్లికన్ పార్టీకి నాయకత్వం వహించే అవకాశం ఉన్న వారి గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. 2028 అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ నుంచి తనకు పోటీ ఎదురవుతుందని చెప్పారు.

మార్కో రూబియోను చాలా మంచి వ్యక్తిగా అభివర్ణించారు. తన కేబినెట్ లో గొప్పవాళ్లు ఉన్నారని, వారిలో ఒకరు (మార్కో రూబియో) ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ వన్ లో మీ పక్కనే ఉన్నారని చెప్పారు. జేడీ వాన్స్‌ను కూడా ట్రంప్ ప్రశంసించారు. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ తనకు సరిజోడి అని కితాబిచ్చారు. 2028 అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వంపై ఈ ఇద్దరి నుంచి ఎవరితో తనకు గట్టి పోటీ వస్తుందో తెలియదని వ్యాఖ్యానించారు.

తన మలేసియా పర్యటన విజయవంతమైందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధానంగా వాణిజ్యం, భూముల డెవలప్మెంట్ పై మలేసియాతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని అన్నారు. ముఖ్యంగా- థాయ్ లాండ్, కంబోడియా మధ్య శాంతి ఒప్పందంపై సంతకం చేశానని తెలిపారు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని బ్రేక్ వేయడం వల్ల మిలియన్ల మంది ప్రాణాలను కాపాడానని ట్రంప్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+