పోర్న్ స్టార్ తో లైంగిక ఒప్పందం; హష్ మనీ కేసులో ట్రంప్ అరెస్ట్?
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగిలింది. ఒకవైపు వచ్చే ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగాలని భావించిన ట్రంప్ పై నేరారోపణలను దాదాపుగా ధ్రువీకరిస్తూ న్యూయార్క్ కోర్టు సంకేతాలు ఇవ్వడంతో నేరారోపణలను ఎదుర్కొన్న మొదటి యూఎస్ మాజీ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ నిలిచారు.
2016 సంవత్సరంలో జరిగిన ఎన్నికల ప్రచార సమయంలో ఓ పోర్న్ స్టార్ కు డబ్బులు ఇచ్చి ఆమెతో శారీరక సంబంధాన్ని బయటకు రాకుండా అనైతికంగా ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణలు ట్రంప్ పై ఉన్నాయి. అయితే ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ రెండేళ్ళ తర్వాత సదరు మహిళా పోర్న్ స్టార్ కోర్టును ఆశ్రయించింది. ఆయన అధ్యక్ష పదవిలో ఉండడంతో హై ప్రొఫైల్ కేసుగా పరిగణించిన దర్యాప్తు సంస్థలు విచారణ జరిపాయి.

ఇక తాజాగా ఈ కేసు పై విచారణ పూర్తి కాగా తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ఆందోళనలకు సిద్ధం కావాలని అనుచరులకు పిలుపునిచ్చారు. తాజాగా గురువారం నాడు న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ ట్రంప్ పై నేరారోపణలు చేసింది. దీంతో ఇప్పుడు ఆయనను అరెస్టు చేస్తారా లేక ఆయనే లొంగిపోతారా అన్నది యూఎస్ రాజకీయాలలో ఉత్కంఠ గా మారింది. 76 సంవత్సరాల రిపబ్లికన్ పార్టీ చరిత్రలో డోనాల్డ్ ట్రంప్ నేరం మోపబడిన మొదటి మాజీ ప్రెసిడెంట్ అవుతారు.
వైట్ హౌస్ రేసులో బరిలోకి దిగాలని భావించిన ట్రంప్ కు నిజంగా ఇది షాక్ అనే చెప్పాలి. ట్రంప్ తనపై చేసిన నేరారోపణను ఎన్నికల నేపథ్యంలో చేసిన ఆరోపణలుగా, రాజకీయ హింసగా అభివర్ణించారు. తాను ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్న వేళ ఇది తనపై కావాలని జరుగుతున్న కుట్రగా ట్రంప్ పేర్కొన్నారు. కచ్చితంగా దీనిపై జో బైడెన్ పై దెబ్బకు దెబ్బ తీసి తీరుతామని శపథం చేశారు. ఒకవేళ ట్రంప్ అరెస్టు జరిగితే అది యూఎస్ చరిత్రలోనే మొదటిదని భావించాలి.












Click it and Unblock the Notifications