ట్రంప్ ఓ ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్: బ్రిటన్ నేత సంచలన ప్రకటన
బ్రిటన్ రాజకీయాల్లో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపమైన గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవాలనే ట్రంప్ ప్రయత్నాలు, ఆ దేశాన్ని సమర్థించే దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధిస్తామనే హెచ్చరికలు పెను సంచలనానికి దారితీశాయి. దీనిపై బ్రిటన్ లిబరల్ డెమొక్రాట్ నేత సర్ ఎడ్ డేవీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. బ్రిటీష్ పార్లమెంట్‌లో ప్రసంగించిన సర్ ఎడ్ డేవీ.. డొనాల్డ్ ట్రంప్‌ను అత్యంత కఠినమైన పదజాలంతో విమర్శించారు. డొనాల్డ్ ట్రంప్‌ను ఓ ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌గా అభివర్ణిస్తూ.. మిత్రదేశాలను బెదిరించడం ఆపాలని డిమాండ్ చేశారు.
వివాదానికి అసలు కారణమేంటంటే?
డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్ ద్వీపాన్ని అమెరికాకు విక్రయించాలని లేదా తమ నియంత్రణలోకి ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. అయితే డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రభుత్వం దీనిని ఖచ్చితంగా తిరస్కరించాయి. డెన్మార్క్ నిర్ణయాన్ని సమర్థించిన బ్రిటన్ సహా 8 ఐరోపా దేశాలపై డొనాల్డ్ ట్రంప్ 10 శాతం నుంచి 25 శాతం వరకు దిగుమతి సుంకాలు విధిస్తానని ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని, గ్రీన్‌లాండ్ డీల్ కుదిరే వరకు ఇవి కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

ట్రంప్‌పై మండిపడిన ఎడ్ డేవీ
బ్రిటన్ లిబరల్ డెమొక్రాట్ నేత ఎడ్ డేవీ పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. "ట్రంప్ ఓ బలహీనులను భయపెట్టే వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారు. మిత్రదేశాల సార్వభౌమత్వాన్ని కాలరాస్తూ, గ్రీన్‌లాండ్ కోసం ఆర్థికంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు" అని మండిపడ్డారు. డొనాల్డ్ ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునే విధానం విఫలమైందని, ఇప్పుడు యూరోప్ దేశాలన్నీ ఏకమై ఆయనకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని డేవీ పేర్కొన్నారు. కేవలం పుతిన్, షీ జిన్‌పింగ్ వంటి వారే ట్రంప్‌కు మద్దతు ఇస్తున్నారని, ప్రజాస్వామ్య దేశాలన్నీ ఆయనకు వ్యతిరేకంగా నిలబడాలని పిలుపునిచ్చారు.
బ్రిటన్, ఫ్రాన్స్ స్పందన:
ట్రంప్ వ్యూహాన్ని 'ఓపెన్ బ్లాక్‌మెయిల్' గా ఫ్రాన్స్ అభివర్ణించింది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టామర్ ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు, అయితే ప్రస్తుతానికి ప్రతిగా అమెరికాపై టారిఫ్‌లు విధించే ఆలోచన లేదని చెప్పారు. బ్రిటన్ ప్రజల్లో ట్రంప్ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఏప్రిల్‌లో జరగాల్సిన కింగ్ చార్లెస్ అమెరికా పర్యటనను కూడా రద్దు చేయాలని కొంతమంది ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.
-
ట్రంప్‌కు భారీ షాక్! ఇరాన్ విషయంలో అంతర్జాతీయ ట్విస్ట్!! -
అమెరికా అన్నంత పనీ చేసిందీ.. ట్రంప్ చేతుల్లోకి హార్మూజ్ జలసంధి..? -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
Trump vs Pope: ట్రంప్ కు పోప్ లియో ఘాటు కౌంటర్-ఇరాన్ వార్ పై మరో షాక్..! -
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బకొడుతున్న డొనాల్డ్ ట్రంప్..: ఫస్ట్ ట్రిగ్గర్ -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!











Click it and Unblock the Notifications