రష్యాకు ట్రంప్ అల్టిమేటం.. యుద్ధం ఆపకపోతే 100 శాతం టారిఫ్ లంటూ వార్నింగ్..
రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడేళ్లకు పైగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఉక్రెయిన్ పై దాడులు మరింతగా పెరిగాయి. వందల కొద్దీ డ్రోన్లు, క్షిపణులతో రష్యా విరుచుకుపడుతోంది. గత 15 రోజులుగా దాడులను ఉద్ధృతం చేసింది రష్యా. తాజాగా 620 డ్రోన్లు, క్షిపణులతో విధ్వంసం సృష్టంచింది. ఈ దాడులకు ఉక్రెయిన్ లోని ఖార్కివ్ నుంచి లీవివ్ ప్రాంతాల వరకు ధ్వంసం అయింది. ఇటీవల 728 డ్రోన్ లు,13 మిసైల్స్ తో రష్యా దాడి చేసింది. ఓ సారి 550 డ్రోన్ లు, 11 మిసైల్స్ తో విధ్వంసం సృష్టించింది. అంతకుముందు 477 డ్రోన్ లు, 60 మిసైల్స్ లో భీకర దాడులు చేసింది.
రష్యా వరుసబెట్టి దాడులు చేపట్టడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉక్రెయిన్ కు సాయం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేసేందుకు ఓకే చెప్పారు. ఈ మేరకు పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ఉక్రెయిన్ రాజధాని అయిన కీవ్ కు పంపించనున్నట్లు తెలిపారు. ఈ ఆయుధాలకు అయ్యే ఖర్చును యూరోపియన్ యూనియన్ చెల్లిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.

అంతేకాక అటు రష్యాకు కూడా బిగ్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఉక్రెయిన్ తో రష్యా శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు రష్యాకు 50 రోజుల అల్టిమేటం ప్రకటించారు. ఈ 50 రోజుల్లో ఉక్రెయిన్ తో శాంతి ఒప్పందం కుదరకపోతే రష్యాతో పాటు ఆ దేశాన్ని సపోర్ట్ చేస్తున్న భాగస్వామ్య దేశాలపైనా 100 శాతం టారిఫ్ లు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ నిర్ణయం అమెరికా విదేశాంగ విధానంలో మార్పులకు సంకేతంగా ఆయన అభివర్ణించారు. జులై 14న నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే తో ట్రంప్ శ్వేతసౌధంలో సమావేశం అయ్యారు. అనంతరం అదే వేదిక నుంచి రష్యాకు వార్నింగ్ ఇచ్చారు.
"ఇది నా యుద్ధం కాదు. ఇది బైడెన్ వల్ల వచ్చిన యుద్ధం. దీన్ని నేను వీలైనంత త్వరగా అణచివేయాలని ప్రయత్నిస్తున్నా. 50 రోజుల్లో రష్యాతో డీల్ జరగకపోతే 100 శాతం టారిఫ్ లు విధిస్తాం. రష్యా భాగస్వామ్య దేశాలపైనా సెకండరీ టారిఫ్ లు విధిస్తాం. ఇరు దేశాల మధ్య రెండు నెలల క్రితమే డీల్ ఓకే కావాల్సి ఉంది. కానీ పుతిన్ దానికి అంగీకరించలేదు" అని ట్రంప్ పేర్కొన్నారు. 2024 అమెరికా ఎన్నికల ప్రచార సమయంలో తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాక.. తాను అధ్యక్షుడిగా ఉండుంటే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం వచ్చేదే కాదని జో బైడెన్ పాలనపై విమర్శలు గుప్పించారు ట్రంప్.
⚡️TLDR: Trump's messages to Russia:
— The World Truth Eyes (@theworldtruthe) July 14, 2025
No deal on Ukraine in 50 days? 100% tariffs.
Ukraine’s getting Patriots fast — some in days.
NATO pays, not us. We’ll build weapons, they’ll buy them.
I talk to Putin, then missiles hit Kyiv. Talks mean nothing. pic.twitter.com/CRZBCKL3cf
మరోవైపు భారత్ లోని కార్మిక శక్తిని వినియోగించుకునేందుకు రష్యా కీలక ప్రతిపాదన చేసింది. 2025 చివరి నాటికి 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన భారత కార్మికులకు రష్యా ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొంది. రష్యాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మిక శక్తి కొరత ఏర్పడిన నేపథ్యంలో రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications