చైనాకు ట్రంప్ అల్టిమేటం!

Donald Trump: భారత్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చైనాకు అదనపు సుంకాలను విధిస్తామని బెదిరించారు. నవంబర్ 1 లోగా వాణిజ్య ఒప్పందం కుదర్చకపోతే చైనా ఉత్పత్తులపై ఏకంగా 155 శాతం వరకు టారిఫ్ విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. సోమవారం వైట్‌హౌస్‌లో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్‌తో జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ ఫెయిర్ ట్రేడ్ డీల్ గురించి మాట్లాడారు. అంతే కాకుండా తాను త్వరలో దక్షిణ కొరియా పర్యటనకు వెళ్తున్నానని.. అక్కడ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశమవుతానని.. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఓ కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

గతంలో అనేక దేశాలు అమెరికాను దోచుకున్నాయి - ట్రంప్
"చైనా మమ్మల్ని చాలా గౌరవిస్తుంది. వారు ప్రస్తుతం మాపై 55 శాతం వరకు భారీ టారిఫ్ విధిస్తున్నారు. ఇది చాలా పెద్ద మొత్తం. కానీ నవంబర్ 1 లోగా ఒప్పందం కుదరకపోతే ఈ శాతం 155 వరకు పెరగవచ్చు" అని ట్రంప్ అన్నారు. గతంలో అమెరికా అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని.. అయితే అనేక దేశాలు అమెరికాను దోచుకున్నాయని, కానీ ఇకపై అలా జరగదని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రయోజనాలను కాపాడుకుంటామని ఆయన వెల్లడించారు. షీ జిన్‌పింగ్‌తో జరగబోయే భేటీలో చైనాతో ఓ అద్భుతమైన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోగలమని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Trump Issues November 1 Deadline to China Threatens 155 Tariffs

ఈ ఒప్పందం ప్రపంచానికే ప్రయోజనకరం
"ఈ ఒప్పందం ఇరు దేశాలకు, ప్రపంచం మొత్తానికి ప్రయోజనకరంగా ఉంటుంది. వారు మా సోయాబీన్‌ను కొనుగోలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఇరు దేశాలకు, ప్రపంచానికి అద్భుతమైనది" అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో తాను చైనాను సందర్శించాలని ఆహ్వానం అందుకున్నట్లు కూడా ట్రంప్ తెలిపారు. కాగా చైనాలోని కొన్ని అరుదైన ఖనిజాల విషయంలో చైనా ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల నేపథ్యంలో, అక్టోబర్ 10న కూడా అమెరికా అధ్యక్షుడు చైనాపై 100 శాతం అదనపు టారిఫ్ విధిస్తామని బెదిరించడం గమనార్హం. ఆ నిబంధనల ప్రకారం.. చైనా నుంచి అరుదైన ఖనిజాలను కొనుగోలు చేసి బయటి దేశాలకు విక్రయించే కంపెనీలు ముందుగా చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+