ట్రంప్ మరో శ‌ృంగారలీల! పోర్న్‌స్టార్‌తో లైంగిక సంబంధం? ఆమె నోరు తెరవకుండా...

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శృంగార‌ లీలల గురించి ది వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఓ పోర్న్‌స్టార్‌తో ఆయనకు శారీరక సంబంధం ఉండేదని, ఈ విషయం వెలుగులోకి రాకుండా ఆమెకు భారీగా డబ్బు ముట్టజెప్పారనేది ఈ కథనం సారాంశం.

మళ్లీ నోరు జారిన ట్రంప్! షిట్ హోల్ కంట్రీస్ అంటూ.., రేగిన దుమారం

ఇది అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జరిగిన ఘటన అంటూ.. తాజాగా ఆ పత్రిక ట్రంప్ పై ఈ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయం వెలుగులోకి వస్తే.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ట్రంప్‌ పరువుకు భంగం కలుగుతుందని భావించి సదరు పోర్న‌స్టార్‌కు భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పి మ్యాటర్ సెటిల్ చేసుకున్నాడట.

అధ్యక్షుల వారు గ్రంథసాంగులే...

అధ్యక్షుల వారు గ్రంథసాంగులే...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రంథసాంగులేనని ఆయన గురించి బాగా తెలిసిన వారు వ్యాఖ్యానిస్తారు. అధ్యక్షుడు కాకముందు ఆయన విచ్చలవిడిగా తిరిగేవారట, పలువురు అమ్మాయిలతో ఆయనకు లైంగిక సంబంధాలు ఉండేవట. అయితే ఈ విషయాలన్నీ ఆయన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తరువాతే వెలుగులోకి వచ్చాయి. మాస్కో హోటల్లో ట్రంప్ సాగించిన అశ్లీల పర్వం గురించి ఇంటర్నెట్ కంపెనీ బజ్‌ఫీడ్ గతంలో సంచలనాత్మక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే.

 ఒబామా దంపతులు బస చేసిన హోటల్ గదిలో...

ఒబామా దంపతులు బస చేసిన హోటల్ గదిలో...

గతంలో మిస్ యూనివర్స్ పోటీల కోసం మాస్కో వెళ్లిన ట్రంప్ అక్కడ రిట్జ్ కార్లటన్ హోటల్ లో రూమ్ బుక్ చేసుకున్నారు. అంతకముందే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సతీమణితో కలసి ఇదే హోటల్ గదిలో బస చేశారు. ఈ హోటల్ గదిలో ట్రంప్ వికృత శృంగార చేష్టలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒబామా దంపతులు గడిపిన బెడ్ పైనే వ్యభిచారిణులతో ట్రంప్ గోల్డెన్ షవర్ చేయించారట. దీనికి సంబంధించి రష్యా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని బజ్ ఫీడ్ తన కథనంలో పేర్కొనడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

 పోర్న్‌స్టార్‌తో సీక్రెట్ అఫైర్?

పోర్న్‌స్టార్‌తో సీక్రెట్ అఫైర్?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఓ పోర్న్‌స్టార్‌తో సీక్రెట్ అఫైర్ ఉందని, మూడో భార్య మెలానియాతో వివాహం తరువాత కూడా ఆయన సదరు పోర్న్‌స్టార్‌తో శారీరక సంబంధం కొనసాగించారని తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ బాంబు పేల్చింది. 2006లో ఒక గోల్ఫ్ గేమ్ లో డొనాల్డ్ ట్రంప్‌కు ఆ పోర్న్‌స్టార్‌తో పరిచయం ఏర్పడిందట. ఆ తరువాత వీరి పరిచయం తర్వాతి రోజుల్లో శారీరక సంబంధానికి దారి తీసిందట.

 ట్రంప్‌ను ఆకర్షించిన పోర్న్‌స్టార్ ఈమే...

ట్రంప్‌ను ఆకర్షించిన పోర్న్‌స్టార్ ఈమే...

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ట్రంప్‌తో సీక్రెట్ అఫైర్ ఉన్న పోర్న్‌స్టార్ అసలు పేరు.. స్టెఫానీ క్లిఫోర్డ్. తెరపై మాత్రం స్టామీ డేనియల్స్‌గా సుపరిచితం. ఈ నీలిచిత్రాల సుందరి పలు అడల్ట్ కంటెంట్ చిత్రాల్లో నటించింది. ఓ గోల్ఫ్ గేమ్‌లో కనిపించిన స్టెఫానీ.. ట్రంప్‌ను అమితంగా ఆకర్షించిందట. ఆ తరువాత మెల్లగా ఆమెతో ట్రంప్ పరిచయం పెంచుకున్నాడని, ఆమెతో శృంగార కలాపాలు సాగించేవాడని, అయితే ఒక దశలో ట్రంప్‌ను స్టెఫానీ బ్లాక్ మెయిల్ కూడా చేసిందని తెలుస్తోంది.

 భారీగా డబ్బు ముట్టజెప్పిన ట్రంప్?

భారీగా డబ్బు ముట్టజెప్పిన ట్రంప్?

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌తో తనకున్న సీక్రెట్ అఫైర్‌ను పోర్న్‌స్టార్ స్టెఫానీ క్లిఫోర్డ్ బయటపెట్టే ప్రయత్నం చేసిందని, ఆమె నోరు విప్పితే తన పరువే పోతుందని భయపడిన ట్రంప్ ఆమెతో వ్యవహారం సెటిల్ చేసుకున్నాడని, ఆమె నోరు మూయించడానికి ట్రంప్ లక్షా ముప్పై వేల డాలర్లు( మన కరెన్సీలో 82 లక్షల రూపాయలు) మొత్తాన్ని పోర్న్‌స్టార్ స్టెఫానీకి ముట్టజెప్పాడని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంలో మైఖేల్ కోహెన్ అనే లాయర్ మధ్యవర్తిత్వం వహించాడని కూడా ఆ పత్రిక పేర్కొంది. అయితే వాల్ స్ట్రీట్ జర్నల్ వైట్ హౌస్ ఖండించింది. ఆ కథనం అబద్ధమని, కుట్ర అని వైట్ హౌస్ పేర్కొంది. మరోవైపు లాయర్ మైఖేల్ కూడా ఈ కథనాన్ని కొట్టిపారేయగా.. పోర్న్‌స్టార్ స్టెఫానీ క్లిఫోర్డ్ మాత్రం మౌనం వహించడం గమనార్హం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A lawyer for President Donald Trump arranged a $130,000 payment to a former adult-film star a month before the 2016 election as part of an agreement that precluded her from publicly discussing an alleged sexual encounter with Mr. Trump, according to people familiar with the matter. Michael Cohen, who spent nearly a decade as a top attorney at the Trump Organization, arranged payment to the woman, Stephanie Clifford, in October 2016 after her lawyer negotiated the nondisclosure agreement with Mr. Cohen, these people said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి