Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆహా! అధ్యక్షుడైన ఇన్నాళ్లకు... ఓ మంచి నిర్ణయం తీసుకున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. ఇన్నాళ్లకు.. డొనాల్డ్ ట్రంప్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. తొలిసారి వివక్షకు వ్యతిరేకమైన నిర్ణయం ఆయన తీసుకున్నారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. ఇన్నాళ్లకు.. డొనాల్డ్ ట్రంప్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. తొలిసారి వివక్షకు వ్యతిరేకమైన నిర్ణయం ఆయన తీసుకున్నారు. లింగమార్పిడి చేసుకున్న విద్యార్థులు వారికి కేటాయించిన బాత్రూంలు, లాకర్ రూమ్స్ ఉపయోగించుకునే విధానానికి స్వస్తి పలికారు.

ఇకనుంచి అన్ని పాఠశాలల యాజమాన్యాలు మిగతా విద్యార్థులకు అవకాశం ఇచ్చినట్లుగానే ట్రాన్స్ జెండర్ విద్యార్థులకు బాత్రూంల విషయంలో, లాకర్ రూమ్ ల విషయంలో సమాన అవకాశాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

Trump revokes Obama guidelines on transgender bathrooms

గతంలో ట్రాన్స్ జెండర్ విద్యార్థులకు ఇలాంటి అవకాశం ఉండేది కాదు. కేవలం తమ లింగానికి చెందిన వారి గదులు, బాత్రూంలు, లాకర్ రూంలు మాత్రమే వినియోగించుకోవాల్సి వచ్చేది. ఈ నిబంధనను గతంలో ఒబామా ప్రభుత్వమే తీసుకొచ్చింది. అయితే ఇప్పడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థల్లో తక్షణమే అమలు చేయాలని పరిపాలన వర్గం ఆదేశించింది.

దీనిపై విద్యాశాఖ కార్యదర్శి బెట్సీ దేవోస్ మాట్లాడుతూ.. ''ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయా స్కూళ్లలో, వర్గాల్లో, కుటుంబాల్లో ఇప్పటి వరకు ఉన్న ఆందోళనలకు తెరపడినట్లవుతుంది. విద్యార్థులు సమస్యలకు పరిష్కారం కొనుగొన్నట్లవుతుంది. రాష్ట్ర, స్థానిక స్థాయిలో ముందుగా పరిష్కరించాల్సిన అతి ముఖ్యమైన సమస్య ఇదే.. ఇక ఈ నిర్ణయంతో విద్యార్థుల నడుమ ఎలాంటి వివక్ష ఉండబోదు..''అని వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+