భారతీయుల ఓట్లకు గాలమేస్తోన్న ట్రంప్ కోడలు
ఆష్‌బర్న్: అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోడలు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. అమెరికాలో భారీ ఎత్తున ఉన్న ఇండియన్స్ ను తన వైపుకు తిప్పుకునేందుకు.. ట్రంప్ ప్రయత్నాలు చేస్తుండగా.. ఇప్పుడు ట్రంప్ కోడలు కూడా అతనికి జతకలిసింది. ఎక్కువ మంది ఇండియన్స్ డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీకే ఓటేయాలని భావిస్తుండడంతో.. ట్రంప్ కు ఓటేయాలంటూ ఆయన కోడలు ప్రచారం చేయడం గమనార్హం.
వర్జీనియాలోని లాడన్ కౌంటీలో రాజధాని హిందూ దేవాలయంలో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు ట్రంప్ రెండో కొడుకు ఎరిక్ ట్రంప్ భార్య లారా. ట్రంప్ ను అధ్యక్షుడిగా గెలిపిస్తే.. భారత్-అమెరికా సంబంధాలు మరింత బలోపేతమవుతాయని లారా ప్రవాస భారతీయులతో పేర్కొన్నారు. భారతీయుల పట్ల తన మామ గారైన ట్రంప్ కు ఎనలేని గౌరవముందన్నారు. తాను కూడా భారతీయుల సాంప్రదాయాలను గౌరవిస్తానని చెప్పిన లారా.. చెప్పులు బయట విడిచి ఆలయంలోకి ప్రవేశించారు.

హిందూ సాంప్రదాయాలను తాను ఎంతగానో ఇష్టపడుతానని ఈ సందర్బంగా లారా తెలిపారు. నిజానికి ఈ వేడుకలకు ట్రంప్ కుమార్తె ఇవాంకా హాజరుకావాల్సి ఉన్నా.. ఆమె మరో చోట జరిగిన కార్యక్రమంలో పాల్గొనడంతో.. లారా పాల్గొనాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల కుటుంబీకురాలు హిందూ దేవాలయానికి దర్శించుకోవడం ఇదే తొలిసారని చెబుతున్నారు. వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన లారాకు.. తొలుత ఇండియన్ ఎన్నారై
అసోసియేషన్ నేత రాజేశ్ గూటి స్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications