ఉత్తర కొరియాకు షాక్: ఆకస్మిక దాడులకైనా వెనుకాడొద్దు.. ట్రంప్
సిరియాపై దాడి అనంతరం అమెరికా తన దృష్టిని ఉత్తర కొరియా వైపు సారించింది. దుందుడుకు చర్యలతో తమకు పక్కలో బల్లెంలా తయారైన కొరియాకు కళ్లెం వేయాలని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ భావిస్తోంది.
వాషింగ్టన్: సిరియాపై దాడి అనంతరం అమెరికా తన దృష్టిని ఉత్తర కొరియా వైపు సారించింది. దుందుడుకు చర్యలతో తమకు పక్కలో బల్లెంలా తయారైన కొరియాకు కళ్లెం వేయాలని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ భావిస్తోంది.
ఆసియా ఖండంలో అస్థిరత్వ చర్యలకు దిగుతోందన్న కారణంతో కొరియాపై అమెరికా దాడులకు సన్నద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఉత్తర కొరియాపై సైనిక చర్య సహా ఆకస్మిక దాడులకు వెనుకాడరాదని ట్రంప్ యోచిస్తున్నారని వైట్ హౌస్ సన్నిహత వర్గాలు పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఉత్తర కొరియాను దారికి తెచ్చే విషంయలో చైనా ముందడుగు వేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. కొరియా చర్యలపై ఎలా స్పందించాలన్న దానిపై అమెరికా జాతీయ భద్రతా బృందం ఇప్పటికే వ్యూహాలు రూపొందించినట్లు తెలిపారు.
అయితే, ఉత్తర కొరియా ఆదివారం నిర్వహించిన క్షిపణి ప్రయోగం విఫలం కావడంతో అమెరికా కాస్త వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.
శనివారం వార్షిక సైనిక కవాతు సందర్భంగా సరికొత్త క్షిపణులు, వాటి ప్రయోగ వేదికలను ప్రదర్శించి ప్రత్యర్థులకు సందేశాలు పంపించాలని ఉత్తర కొరియా భావించింది. ఈ చర్యను అమెరికా తప్పుబట్టింది. కవ్వింపు, అస్థిరపరిచే చర్యలకు కొరియా దిగుతోందని అమెరికా మండిపడింది.
-
ఖమేనీ సంధి ఒప్పందం? -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications