స్టార్మీతో 1,30,000డాలర్ల ఎఫైర్ ఒప్పందం: ఎట్టకేలకు స్పందించిన ట్రంప్, ఏమన్నారంటే?
Recommended Video

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తనపై వచ్చిన ఎఫైర్లపై స్పందించారు. తాను ఎఫైర్ నడిపినట్లు ప్రచారం జరుగుతున్న పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కి 1,30,000డాలర్లు చెల్లించినట్లు తనకు తెలియదని ట్రంప్ స్పష్టం చేశారు.
2006లో ట్రంప్‌తో తనకు ఎఫైర్ ఉందని, అది బయట పెట్టకుండా ఉండేందుకు తనకు 2016 అక్టోబరులో ట్రంప్ ప్రైవేట్ అటార్జీ మైకేల్ కోహెన్ 1,30,000డాలర్లు చెల్లించారని స్టార్మీఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ట్రంప్ దీనిపై గురువారం స్పష్టతనిచ్చారు.

ట్రంప్ సమాధానం ఇదీ
పోర్న్ స్టార్ స్టార్మీడేనియల్స్‌కు కోహెన్ భారీ మొత్తం డబ్బు చెల్లించిన విషయం మీకు తెలుసా? అని మీడియా ప్రశ్నించగా.. తనకు తెలియదని ట్రంప్ సమాధానమిచ్చారు. అయితే, ఆ తర్వాత ఇంకేమైనా ఉందా? అంటూ టాపిక్ డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించారు.

డైవర్ట్ చేసేందుకు ట్రంప్ యత్నం
అయినా, మీడియా ప్రతినిధులు మాత్రం ఈ ఎఫైర్ గురించే ప్రశ్నలను సంధించారు. స్టార్మీకి మైకేల్ కోహెన్ ఎందుకు డబ్బులు ఇచ్చారని మీడియా ప్రశ్నించడంతో ట్రంప్ కొంత అసహనానికి గురయ్యారు. ఈ ప్రశ్న కోహెన్‌నే అడగాల్సిందని ట్రంప్ బదులిచ్చారు.

ఒప్పందం గురించి అతడ్నే అడగండి
మైకేల్ తన ప్రైవేట్ అటార్నీ అని, అతడ్నే ఆ విషయంపై అడిగితే బాగుంటుందని స్పష్టం చేశారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియదని ట్రంప్ చెప్పారు. స్టార్మీకి ఇవ్వడానికి మైకేల్‌కు ఆ డబ్బు తానే ఏర్పాటు చేశానన్న ఆరోపణలు ఎలాంటి వాస్తవం లేదని అన్నారు.

ట్రంప్‌కే తెలియకపోతే ఒప్పందం ఎక్కడిది?
ఇది ఇలావుంటే, ఆ ఒప్పందంపై ఇటీవల స్టార్మీ డేనియల్స్ దావా కూడా వేశారు. ట్రంప్‌తో తన ఎఫైర్ బయటపెట్టకుండా ఉండేందుకు చేసిన ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు. ఒప్పంద పత్రాలపై ట్రంప్ సంతకం చేయనందున ఆ అగ్రిమెంట్ చెల్లదని స్టార్మీ చెబుతున్నారు. ఒప్పందం విషయం ట్రంప్‌కే తెలియకపోతే ఇక ఒప్పందం ఎలా అమలవుతుందని స్టార్మీ తరపు న్యాయవాది ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications