మహిళే కావాలనుకుంటే నా కూతురుందిగా- కమలా హ్యారిస్‌పై మరోసారి విషం కక్కిన ట్రంప్‌..

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు దగ్గర పడుతున్న కొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ఇండో-జమైకాన్‌ మూలాలన్న డెమోక్రాట్‌ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హ్యారిస్‌పై రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్‌ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల రేసులో పోటీ పడేందుకు ఆమె సరిపోరని వ్యాఖ్యానించారు.

Recommended Video

    US Election 2020 : Ivanka Is More Fit To Be First Female President Than Kamala Harris - Donald Trump

    న్యూహ్యాంప్‌షైర్‌లో తాజాగా జరిగిన రిపబ్లికన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌ కమలా హ్యారిస్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు మహిళా అధ్యక్షురాలని చూడాలని తాను కూడా కోరుకుంటున్నానని, కానీ ఆ పదవికి తన కూతురు ఇవాంకా సరిపోతుందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కమలా హ్యారిస్‌ తరహాలో అధ్యక్ష పదవి కోసం పోటీ పడటం కాదని, అసలు ఆమె అధ్యక్ష పదవికి సరిపోరన్నారు. వాస్తవానికి ఏడాది క్రితం వరకూ డెమెక్రాట్ల తరఫున అధ్యక్ష రేసులో ఉన్న కమల చివరి నిమిషంలో తగినంత ఆదరణ లేదనే కారణంతో ఉపాధ్యక్ష పదవికి పోటీ పడాల్సి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

    trump says kamala harris not competent to be president, suggest daughter ivanka instead

    ఏడాది క్రితం వరకూ అధ్యక్ష రేసులో ఉన్న కమలా హ్యారిస్‌ అనూహ్యంగా ఆదరణ కోల్పోయిన విషయాన్ని ట్రంప్‌ మరోసారి గుర్తుచేశారు. మొదట 15 పాయింట్లతో ఉన్న ఆమె క్రమంగా 12, 11, 8, 5 పాయింట్లకు తగ్గిపోయారని తెలిపారు. ఆ తర్వాత అధ్యక్ష రేసు నుంచే తప్పుకుని ఉపాధ్యక్షురాలిగా పోటీపడుతున్నారని ట్రంప్‌ ఎద్దేవా చేశారు. అధ్యక్ష రేసులో ఉన్న జో బిడెన్ పరిస్ధితి మరీ దారుణమన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+