మళ్ళీ షాకిస్తున్న ట్రంప్... వారి గ్రీన్ కార్డుల ప్రాసెసింగ్ నిలిపివేత!
యుఎస్ లో భారతీయులు ప్రశాంతంగా బ్రతికే పరిస్థితి లేదు. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ రావడంతో భారతీయులకు కష్టాలు మొదలయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి సంచలన నిర్ణయాలతో ముఖ్యంగా భారతీయులకు షాకిస్తున్నారు. అక్రమ వలసదారుల పైన కఠిన చర్యలు తీసుకుంటున్న ట్రంప్ సరైన డాక్యుమెంట్లు లేకుండా దేశంలోకి వచ్చిన వారిని దేశం నుండి పంపిస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా చేతులకు సంకెళ్ళు వేసి ప్రత్యేక విమానాలలో వారిని తరలిస్తున్నారు.
రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటున్న ట్రంప్
అమెరికా పౌరులు మొదట అని తన నినాదాన్ని తెలిపిన ట్రంప్ వలసదారులను నియంత్రించే కార్యక్రమంలో భాగంగా రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. అమెరికా దేశానికి వెళ్లి చదువుకునే విద్యార్థులకు సైతం ట్రంప్ తీరు అశనిపాతంగా మారింది. పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా పట్టుకుంటే భారత్ కు తిప్పి పంపుతున్నారు. దీంతో ట్రంప్ వ్యవహార శైలి ఎవరికీ నచ్చటం లేదు.

గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ నిలిపివేత
ముఖ్యంగా భారతదేశం నుండి యూఎస్ కు ఎన్నో కలలతో వెళ్లిన వారికి మింగుడు పడనిదిగా తయారైంది. ఇక తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్ శరణార్థులతో పాటు మరికొందరికి గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ నిలిపివేశారు. శరణార్థులు లేదా ఆశ్రయం పొందిన వారు అమెరికాలో శాశ్వత నివాసం కోసం పెట్టుకున్న అభ్యర్థనలను ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ వెల్లడించింది.
ఇండియన్స్ కు తీవ్ర నష్టం
అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్ నుండి అక్కడకు వెళ్లిన వారు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2023 సంవత్సరంలో 51 వేల కంటే ఎక్కువ మంది ఇండియన్స్ గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ట్రంప్ చర్యతో గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ ఆగిపోయింది మళ్ళీ అసలు గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ ను ట్రంప్ ఎప్పుడు పునరుద్ధరిస్తారు అనే విషయం అమెరికా ఇప్పటివరకు వెల్లడించలేదు.
వారికి ఊహించని షాక్
ఇప్పటికే ఎఫ్ 1 వీసా దారులు, హెచ్ వన్ బి వీసాదారులు ట్రంప్ చర్యలతో వణికిపోతున్నారు. ఇప్పుడు గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారికి కూడా ట్రంప్ తీరు ఇబ్బందిని కలిగిస్తుంది. వారికి ట్రంప్ తాజా నిర్ణయం ఊహించని షాక్ కు గురి చేస్తుంది.
-
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
షాక్: స్టూడెంట్ వీసాల్లో 60 శాతం కోత: భారత్ జోరుకు ట్రంప్ బ్రేకులు.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications