కాసేపు కలకలం: ట్రంప్ టవర్స్ లో బాంబు, పరుగులు దీసిన జనం
అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రాంప్ కు చెందిన ట్రంప్ టవర్స్ లో మంగళవారం ఒక బ్యాగులో బాంబు ఉందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో టవర్స్ లోని జనం బయటకు పరుగులు దీశారు.
న్యూయార్క్: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రాంప్ కు చెందిన ట్రంప్ టవర్స్ లో మంగళవారం ఒక బ్యాగు కారణంగా కలకలం రేగింది. అందులో బాంబు ఉందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో టవర్స్ లోని జనం బయటకు పరుగులు దీశారు. తీరా అది బాంబు కాదని, పిల్లలు ఆడుకునే ఆట బొమ్మని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.
మన్ హట్టన్ లోని 56వ వీధిలో ఉన్న ఫిఫ్త్ అవెన్యూలో ఉంది ట్రంప్ టవర్స్. ఇందులోనే డొనాల్డ్ ట్రంప్ ఇల్లు, కార్యాలయంతోపాటు ఓ లాబీ, మరికొన్ని ఇళ్ళు, రెస్టారెంట్లు, షాపులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ట్రంప్ కూడా టవర్స్ లో లేరు. ఆయన విశ్రాంతి కోసం ఫ్లోరిడాలోని ఎస్టేట్ కు వెళ్ళారు.
అయితే ట్రంప్ టవర్స్ లో మంగళవారం ఒక బ్యాగు అనుమానాస్పదంగా కనిపించడం ఈ బాంబు ఉందన్న పుకారుకు కారణమైంది. సమాచారం అందిన వెంటనే న్యూయార్క్ పోలీసులు రంగంలోకి దిగారు. హుటాహుటిన ట్రంప్ టవర్స్ కు చేరుకొని ముందు అందులోని వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ఈలోగా బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి అనుమానాస్పదంగా కనిపిస్తున్న బ్యాగును స్వాధీనం చేసుకుని తెరిచి చూసింది. అందులో కేవలం పిల్లలు ఆడుకునే బొమ్మ తప్ప మరేమీ కానరాకపోవడంతో సాయంత్రం 5 గంటల సమయంలో క్లియరెన్స్ ఇచ్చినట్లు న్యూయార్క్ పోలీస్ శాఖ అధికార ప్రతినిధి స్టీఫెన్ డేవిస్ వెల్లడించారు.
బాంబు వార్తలు పుకారు అని తేలడంతో ట్రంప్ టవర్స్ లోని సిబ్బంది మళ్ళీ తమ పనుల్లో నిమగ్నమైనట్లు ట్రంప్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ తెలిపారు. న్యూయార్క్ లో రోజూ ఇలాంటి కాల్స్ సాధారణమేనని, ఈ ఏడాది జరిగిన ప్రెషర్ కుక్కర్ బాంబు పేలుడు తర్వాత ఇప్పటి వరకు 800 వరకు ఇలాంటి ఫేక్ కాల్స్ వచ్చాయని అక్కడి పోలీసులు వివరించారు.
-
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి












Click it and Unblock the Notifications