ట్రంప్ వర్సెస్ బైడెన్... ఆటోపెన్ క్షమాభిక్షలు చెల్లవా? అసలేమిటీ ఆటోపెన్?
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనగా కుర్చీ దిగబోతున్న జో బైడెన్ ట్రంప్ కు ఊహించని షాక్ ఇచ్చారు. ట్రంప్ ప్రభుత్వం నుంచి కొందరు కీలక వ్యక్తులను రక్షించడానికి జో బైడెన్ కొన్ని సాహసోపేతమైన చర్యలకు దిగారు.ఇక దానిపై ట్రంప్ తాజాగా రివర్స్ షాక్ ఇచ్చారు.
ట్రంప్ వర్సెస్ బైడెన్.. ఆటోపెన్ వివాదం
డాక్టర్ ఆంటోనీ ఫౌచీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లి, జనవరి 6 2021 వ తేదీన యుఎస్ క్యాపిటల్ పై దాడి చేసిన కేసును దర్యాప్తు చేసిన హౌస్ కమిటీ సభ్యులకు జో బైడెన్ క్షమాభిక్ష మంజూరు చేశారు. అయితే తాజాగా ఆ క్షమాభిక్ష చెల్లదని, బైడెన్ ఆటోపెన్ తో చేసిన సంతకం చెల్లదని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అసలు ఏమిటీ ఈ ఆటోపెన్ అని అందరూ దీనిపై చర్చిస్తున్నారు.
వారిపై ట్రంప్ రివెంజ్ తీర్చుకోకుండా క్షమాభిక్ష
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తనకు వ్యతిరేకంగా పని చేసిన వారిపై రివెంజ్ తీర్చుకోకుండా కాపాడటం కోసం బైడెన్ వారికి క్షమాభిక్ష పెట్టారు. ఆ చర్యతో వారు సంబంధిత కేసులలో నేరానికి పాల్పడినట్టు తేలినా ఎటువంటి చర్యలు తీసుకోకుండా బైడెన్ వారిని కాపాడారు. సంబంధిత కేసులలో వీరికి శిక్ష గాని జరిమానా కానీ లేకుండా ఆయన వారికి క్షమాభిక్ష ప్రకటించారు.

ట్రంప్ ఎనిమీస్ లిస్ట్ లో వాళ్ళను కాపాడే ప్రయత్నం చేసిన బైడెన్
చివరిసారిగా తన పవర్స్ యూజ్ చేసిన బైడెన్ ట్రంప్ ఎనిమీస్ లిస్ట్ లో వీరు ఉంటారని భావించి వీరిని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020 ఎన్నికల ఫలితాలను తిరస్కరించి క్యాపిటల్ పై దాడికి దారి తీసిన తన ప్రవర్తనకు సంబంధించి తనను విచారణకు గురి చేసిన వారిని శిక్షిస్తానని ట్రంప్ ప్రకటించారు.
ట్రంప్ నుండి బైడెన్ కాపాడింది వీరినే
తనకు అనుకూలంగా ఉన్న క్యాబినెట్ సభ్యులనే నియమించి రాజకీయ ప్రత్యర్థులను కఠినంగా శిక్షించడానికి సిద్ధమవుతున్నట్టు ఆయన సంకేతాలు ఇచ్చిన వేళ ట్రంప్ కు చెక్ పెట్టడానికి బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బైడెన్ ట్రంప్ ను వ్యతిరేకించిన డాక్టర్ ఆంటోనీ ఫౌచీ, జనరల్ మార్క్ మిల్లె, జనవరి 6వ తేదీన క్యాపిటల్ తిరుగుబాటులో ట్రంప్ పాత్రపై దర్యాప్తు చేసినటువంటి సభ్యులు వీరందరికీ క్షమాభిక్షను ప్రకటించారు.
ఆటోపెన్ తో క్షమాభిక్ష చెల్లదా?
ట్రంప్ నుంచి చట్టపరమైన, రాజకీయ దాడుల నుంచి రక్షించడం కోసం వీరికి క్షమాభిక్షను మంజూరు చేశారు. ప్రస్తుతం ట్రంప్ వారికి బైడెన్ ఇచ్చిన క్షమాభిక్ష చెల్లదని, వారంతా ఉన్నత స్థాయి దర్యాప్తు ఎదుర్కోవాలని తేల్చి చెప్పారు. ఆటో పెన్ తో క్షమాభిక్ష ఇస్తూ చేసిన సంతకాలు చెల్లనివని ఆయన పేర్కొన్నారు. నాడు బైడెన్ ప్రకటించిన క్షమాభిక్షలన్నీ ఆటోపెన్ తో సంతకం చేసినవని, బైడెన్ కు ఏమీ తెలియదని ట్రంప్ వాదన.
బైడెన్ ఆటోపెన్ వాడారా లేదా ?
బైడెన్ నిద్రమత్తులో ఉండగా రాజకీయ దుండగులు చాలామందికి క్షమాభిక్షలు ప్రసాదించారని ఆయన అన్నారు. అయితే ఆటో పెన్ వివాదం తెరపైకి రావడంతో అసలు బైడెన్ ఆరోగ్యం పైన చాలా సందేహాలు వెల్లడవుతున్నాయి. కానీ ఇక్కడ ట్రంప్ చెప్పినట్లు బైడెన్ ఆటో పెన్ వాడారా లేదా అన్నది కూడా స్పష్టత లేదు. ఇక ట్రంప్ కూడా ఈ వ్యవహారం పైన స్వల్పంగా స్వరం మార్చి అది తన నిర్ణయం కాదని కోర్టులపై ఆధారపడి ఉంటుందని అన్నారు.
ఆటోపెన్ వాడేది ఇందుకే
కానీ అవి చెల్లవని తాను చెబుతున్నానని, అసలు ఏం జరిగింది అనేది బైడెన్ కు కూడా కచ్చితంగా తెలియకపోయి ఉండొచ్చు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక ఆటో పెన్ అనేది ఏ వ్యక్తికి సంబంధించిన డూప్లికేట్ సంతకాలను నిజమైన ఇంకుతో చేసే యంత్రం. ఇది ప్రజా జీవితంలో ఉండే కీలకమైన వ్యక్తులు, సెలబ్రిటీలు తమ వాణిజ్య అవసరాల కోసం భారీ సంఖ్యలో సంతకాలు పెట్టాల్సి వచ్చినప్పుడు దీనిని వాడుతుంటారు.
ఆటోపెన్ వీటిలో వాడతారు
ఆటో పెన్ ఒక ప్రింటర్ సైజులో చేయి తరహా ఒక మెషీన్ ను కలిగి ఉంటుంది. ఇది ఒక సాధారణమైన పెన్నును లేదా పెన్సిల్ పట్టుకుంటుంది. దీనిలో ప్రోగ్రాం చేసిన సంతకాన్ని ఇది డూప్లికేట్ చేస్తుంది. సాధారణంగా గవర్నమెంట్ ఏజెన్సీలలో, యూనివర్సిటీలలో, ఇతర సంస్థల్లో ఈ ఆటో పెన్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రభావవంతమైన నేతలు దీనిని కొన్నేళ్లుగా వాడుతున్నారు. ఇది రాజకీయ నాయకులు వివిధ సందర్భాలలో ఉపయోగించి అనేక చర్చలకు కూడా కారణం అయ్యారు.
ఆటోపెన్ వాడటం చట్టబద్ధమేనా?
ఇప్పుడు ఆటో పెన్ తో చేసిన సంతకం చెల్లుతుందా లేదా లీగల్ గా ఇది చట్టబద్ధమేనా అన్న దానిపైన చర్చ జరుగుతుంది. అయితే 2005 అమెరికాలోని జస్టిస్ డిపార్ట్మెంట్లోని ది ఆఫీస్ ఆఫ్ లీగల్ కౌన్సిల్ మార్గదర్శకాలు ప్రకారం ఆటో పెన్ వాడడం చట్టబద్ధమే. మరి ఈ క్రమంలో ట్రంప్ క్షమాభిక్ష చెల్లదని చేసిన వ్యాఖ్యలపై ముందు ముందు ఏం జరగబోతుంది అన్నది తెలియాల్సి ఉంది. ఈ క్షమాభిక్షల వ్యవహారం ఇప్పుడు యూఎస్ లో చర్చగా మారింది.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది












Click it and Unblock the Notifications