మరో 48 గంటల్లో ప్రళయం.. ఇరాన్ ఖతం: ట్రంప్ ఫైనల్ వార్నింగ్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. హార్మూజ్ జలసంధిని తక్షణమే ఓపెన్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. 'తమతో ఒప్పందం చేసుకోవడానికి లేదా హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు నేను 10 రోజుల గడువు ఇచ్చాను. సమయం మించిపోతుంది. వారిపై ప్రళయం విరుచుకుపడేందుకు ఇంకా 48 గంటల సమయం మాత్రమే ఉందని ట్రూత్ సోషల్ మీడియా ద్వారా పోస్టు చేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. నెల రోజులకుపైగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తోంది. మరోవైపు ఇరాన్ ప్రతీకార దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. తమతో ఒప్పందం చేసుకోవడానికి లేదా హార్మూజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ కు ఇచ్చిన 10 రోజుల గడువు దగ్గర పడిందని పేర్కొన్నారు. సమయం మించిపోతుందని అన్నారు. ప్రళయానికి ఇంకా 48 గంటలే మిగిలి ఉందని.. అంతా దేవుడి దయ అని తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్ ద్వారా సంచలన హెచ్చరికలు జారీ చేశారు.
ఇక ఇరాన్ శక్తి వనరులు, పవర్ ప్లాంట్లపై దాడులు చేయకుండా గతంలో ట్రంప్ 10 రోజుల పాటు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇరాన్ ప్రభుత్వం కోరిక మేరకు చర్చల కోసం ఈ సమయం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇరాన్ తో సంధి చర్చలు బాగానే జరుగుతున్నాయని ట్రంప్ మరోసారి స్పష్టం చేయడం గమనార్హం.

అయితే ఇరాన్ త్వరగా నిర్ణయం తీసుకోకపోతే 48 గంటల్లో అంటే సోమవారం రాత్రి 8 గంటల తర్వాత సైనిక చర్య తప్పదని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం అని చెప్పొచ్చు. దీన్ని మూసివేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది.
-
Hormuz: హార్ముజ్ లో అసలు నష్టం భారత్ కే? కేంద్రం షాకింగ్ ..! -
అమెరికా యుద్ధ విమానాల్లో నుంచి దూకేసిన పైలట్లు-పట్టిస్తే ఇరాన్ భారీ బౌంటీ..! -
F-35 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్.. అమెరికాలో చేయి దాటిన పరిస్థితి! -
ముంచుకొస్తున్న గ్యాస్ సంక్షోభం.. పాత బుకింగ్లకే దిక్కులేని పరిస్థితి! -
పెట్రోల్ పై రూ. 80 తగ్గింపు: బస్సు ప్రయాణం పూర్తిగా ఉచితం -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
డొనాల్డ్ ట్రంప్ నాన్చివేత ధోరణి- 19 నిమిషాల ప్రసంగంలో ఇరాన్ భవిష్యత్ -
కేంద్రం వరాల సునామీ -
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
పారాసెటమాల్, బీపీ టాబ్లెట్ల రేట్లు భారీగా పెంపు? -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం












Click it and Unblock the Notifications