ట్రంప్‌ని పుతిన్ లంచ్‌లో తినేస్తారు: కమలా హారిస్, ట్రంప్ స్ట్రాంగ్ కౌంటర్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా డోనాల్ ట్రంప్.. డెమోక్రాటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా, ఫిలడెల్ఫియాలో జరిగిన డిబేట్‌లో ఒకరిపై ఒకరు హాట్ కామెంట్స్ చేసుకున్నారు. యూఎస్ ప్రెసిడెన్షియల్ డిబేట్ సందర్భంగా.. డొనాల్డ్ ట్రంప్‌ను పుతిన్ వంటి నియంతలు తారుమారు చేశారని కమలా హారిస్ ఆరోపించగా.. బలహీనమైన విదేశాంగ విధానాలు పాటించారంటూ హారిస్, బిడెన్ పరిపాలనపై ట్రంప్ మండిపడ్డారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యునైటెడ్ స్టేట్స్ తరపున శాంతి ఒప్పందాన్ని తాను మధ్యవర్తిత్వం చేయగలనని ట్రంప్ పేర్కొనగా.. మాజీ అధ్యక్షుడు ట్రంప్ ను పుతిన్ నియంత అని వ్యాఖ్యానించారని కమలా హారిస్ చెప్పారు. ట్రంప్‌ను పుతిన్ తన లంచ్‌లో తినేయగలరని హరిస్ ఎద్దేవా చేశారు. వాస్తవానలను మరల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ట్రంప్.. నియంతలను ఆరాధిస్తారని అందరికీ తెలుసని కమలా హారిస్ వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో ప్రేమ లేఖలు మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ నియంతలంతా ట్రంప్‌ను దేశాధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. అందుకే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడం తమ దేశానికి అవమానకరమని చాలా మంది సైనిక నాయకులు తనతో చెప్పారని కమలా హారిస్ అన్నారు.
ఒక వేళ ట్రంప్.. పుతిన్ అయితే.. ఉక్రెయిన్ లోపలే కూర్చునేవాడని అన్నారు కమలా హారిస్. యూరోపియన్ యూనియన్ దేశాలు, మన స్థానిక మిత్రులు ట్రంప్ దేశాధ్యక్షుడు కావద్దని కోరుకుంటున్నారని అన్నారు. ప్రపంచంలో గొప్ప సైనిక కూటమి నాటో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, ఆ దేశ ప్రజలు చేస్తున్న స్వాతంత్ర్య పోరాటానికి మద్దతు పలుకుతోందన్నారు. లేదంటే పుతిన్.. కీవ్‌లో కూర్చుని ఇతర యూరోప్ దేశాలపై కన్నేసేవాడని అన్నారు. నియంతలతో స్నేహం చేసే ట్రంప్‌ను పుతిన్ తన లంచ్‌లో తినేస్తాడని పునరుద్ఘాటించారు.
🚨 BREAKING - Kamala Harris Says Putin Would "Eat Trump For Lunch"
— T R U T H P O L E (@Truthpolex) September 11, 2024
What the hell is even going on?#Trump #Biden #Election #KamalaHarris #Presidential #Election #Russia #Putin pic.twitter.com/nR2sFsOTRM
'పుతిన్.. కమలా హారిస్‌ను ఆమోదించారు, ఎందుకంటే నేను అక్కడ ఉంటే, యుద్ధం ఎప్పుడూ జరిగేది కాదు' అని కమల వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. తాను ఈ యుద్ధం ఆగిపోవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. జో బైడెన్ కు యుద్దాన్ని ఆపే శక్తి లేదన్నారు. బైడెన్ ఎప్పుడూ పుతిన్‌కు ఫోన్ చేయలేదన్నారు. యుద్దం ఎలా ఆపాలో అతనికి తెలియదన్నారు. తాను గెలిస్తే మాట్లాడి యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పారు. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందన్నారు. అంతేగాక, బతికి ఉన్నాడో లేడో తెలియని అధ్యక్షుడు మనకు ఉన్నాడని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో కమలా హారిస్ స్పందిస్తూ.. మీరు బైడెన్ తో పోటీ చేయడం లేదు.. నాకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు అని అన్నారు. తాను యుద్ధం ప్రారంభం ముందే ఉక్రెయిన్ అధ్యక్షుడితో కలిసినట్లు హారిస్ తెలిపారు. ఆ తర్వాత తాను ఉక్రెయిన్ స్వతంత్ర సార్వభౌమ దేశంగా ఉండేందుకు నాటో మద్దతు ఇచ్చేలా చేసినట్లు తెలిపారు. అయితే, కమల శాంతి చర్చలు జరిపారు కానీ, వారికి నచ్చకపోవడంతో యుద్ధం చేసేందుకే మొగ్గు చూపారన్నారు. బైడెన్ కన్నా ఆమె ప్రతిభ అధ్వాన్నంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications