Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమ్మ బాబోయ్.. 2028 లోనూ ట్రంపేనా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం తాను మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేనని తేల్చి చెప్పారు. అది చాలా బ్యాడ్ గా ఉంటుందన్నారు. అమెరికా రాజ్యంగాన్ని క్షుణ్ణంగా చదివితే అర్థం అవుతుందని.. ఎవరైనా రెండు సార్లకు మించి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టలేరని స్పష్టం చేశారు. కానీ మనకు చాలా మంది గొప్ప వ్యక్తులు ఉన్నారంటూ చెప్పుకొచ్చారు ట్రంప్.

అయితే 2028 వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసి అమెరికాను రూల్ చేస్తారని వచ్చిన ఊహాగానాలపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు కూడా ట్రంప్ బదులిచ్చారు. తాను వైస్ ప్రెసిడెంట్ గానూ పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదని తెలిపారు. తనకు ఆ అవకాశం ఉంది కానీ.. తాను దాన్ని కొట్టిపారేస్తున్నట్లు తెలిపారు. అది వినడానికి చాలా క్యూట్ గా ఉందన్నారు. ప్రజలు ఇలాంటి అంగీకరించరని.. ట్రంప్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అది సరైన నిర్ణయం అనిపించుకోదన్నారు.

అమెరికా రాజ్యాంగంలో 1951 లో చేసిన 22 వ సవరణ ప్రకారం.. ఏ వ్యక్తి అయినా రెండు సార్లకు మించి అధ్యక్ష పదవిని చేపట్టడానికి వీలు లేదు.. అని ఉంది. అలాగే 12 వ సవరణ ఓసారి చూస్తే.. రాజ్యాంగం పరంగా ఎవరైతే అమెరికా అధ్యక్ష పదవికి అర్హులు కారో.. వాళ్లు అమెరికా వైస్ ప్రెసిడెంట్ పదవికి అర్హులు అని ఉంది. అయితే ట్రంప్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బానోన్ గతంలో చాలాసార్లు ఈ విషయంపై ప్రస్తావించారు. 2028 అధ్యక్ష ఎన్నికల తర్వాత కూడా ట్రంప్ శ్వేతసౌథంలో ఉండేందుకు ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు.

మరి అమెరికా రాజ్యాంగం అడ్డురాదా..? అన్న ప్రశ్నకు.. వాటి నుంచి తప్పించుకునేందుకు చాలా మార్గాలు ఉన్నాయని స్టీవ్ బానోన్ అన్నారు. కానీ ఈ విషయాలపై స్పష్టంగా చెప్పలేదు. అయితే మూడోసారి అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ట్రంప్ ఎంత సీరియస్ గా ఉన్నారనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్.. తన పదవీకాలం ముగిసేసరికి 82 ఏళ్లకు చేరుకుంటారు. ఆ వయసులో ఆయన మూడోసారి అధ్యక్ష పదవికి ప్లాన్ చేస్తారా..? అన్న సందేహాలు ఉన్నాయి.

అలా అయితే ఫస్ట్ ప్లాన్ గా.. ట్రంప్.. అమెరికా రాజ్యాంగాన్ని సవరించే ప్లాన్ చేయాల్సి ఉంటుంది. కానీ అందుకు 2/3 వంతు మెజారిటీ హౌజ్ లో అలాగే సెనేట్ లో రావాలి. అలాగే స్టేట్ లెజిస్లేటర్ల మద్దతు కూడా కావాల్సి ఉంటుంది. ఇక రెండో ప్లాన్.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఉండటం.. మూడో ప్లాన్ ట్రంప్ స్పీకర్ ఆఫ్ ది హౌజ్ గా మారడం.. ఇక చివరి ప్లాన్ ఏంటంటే 22వ రాజ్యాంగ సవరణను కోర్టులో సవాల్ చేయడం.

Trump s White House Encore VP Speaker or Amendment Overhaul

22 వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. ఓ వ్యక్తి మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం నిషేధం. కానీ ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి.. మూడోసారీ కంటిన్యూ చేయకూడదని అందులో లేదు. కానీ ఇది కోర్టులో ఎక్కువ కాలం చెల్లదు. మరి ఈ నాలుగు ప్లాన్లలో ఒకటి సెలెక్ట్ చేసుకుని మూడోసారీ అధ్యక్ష పగ్గాలు చేపడతారా..? లేక మందునుంచీ చెప్తున్నట్లుగా మూడోసారి పోటీ చేయకుండా ఉంటారా..? అనేది తెలియాల్సి ఉంది. ఇక అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు 2028, నవంబర్ 7 న జరగనున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+